ప్రాణం తీశాక పరువు ఎక్కడ ఉంది?
ప్రణయ్ పరువు హత్య నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఒకరి ప్రాణం తీయటంలో పరువు ఎక్కడ ఉంది? సమాజం పేరుతో మనం ఎక్కడికి వెళ్తున్నాం అంటూ ప్రణయ్ హత్య ఘటనపై కథానాయకుడు రామ్‌చరణ్ తీవ్ర ఆవేదనని, ఆవేశాన్ని వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా సంచలన రేకెత్తించిన ప్రణయ్ హత్య ఉదంతంపై సాధారణ ప్రజల దగ్గర్నుంచి సెలబిట్రీల వరకు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి దారుణ ఘటన మళ్ళీ పునరావృతం కాకూడదని వేడుకుంటున్నారు. ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకొని కొత్త జీవితం ప్రారంభించిన ప్రణయ్‌ను అన్యాయంగా చంపడం దారుణం. అమృతవర్షిణీ, ప్రణయ్ కుటుంబాలకు నా ప్రగాఢ సానూభూతి తెలియజేస్తున్నాను అని రామ్‌చరణ్ ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. అలాగే ప్రేమకు హద్దులు లేవు, ప్రణయ్‌కు న్యాయం జరగాలి (జస్టీస్ ఫర్ ప్రణయ్) అనే హ్యాష్‌ట్యాగ్‌లను కూడా జత చేశారు.













