మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇంటర్వ్యూ..
మాస్ ఇమేజ్ ఉన్న హీరో రామ్ చరణ్, హీరోయిజంను మాస్ యాంగిల్‌లో అద్భుతంగా ఆవిష్కరించే దర్శకుడు బోయపాటి శ్రీను వీరిద్దరి కలయికలో శ్రీమతి డి. పార్వతి సమర్పణలో డి.వి.వి. ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై అగ్ర నిర్మాత దానయ్య డి.వి.వి. నిర్మించిన కమర్షియల్ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘వినయ విధేయ రామ’. ఫస్ట్‌లుక్, టీజర్, సాంగ్స్‌కు వచ్చిన ట్రెమెండెస్ రెస్పాన్సే సినిమాపై ఉన్న అంచనాలను తెలియజేస్తున్నాయి. ట్రైలర్ విడుదలైనప్పటి నుండి సినిమాపై ఉన్న అంచనాలు భారీగా పెరిగాయి. వినయ విధేయ రామ జనవరి 11 ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా మెగా పవర్ స్టార్ ‘రామ్ చరణ్’తో ఇంటర్వ్యూ.
వినయ విధేయ రామ టైటిల్ వినగానే ఫస్ట్ మీ రియాక్షన్?
– నాకు బోయపాటి గారి ‘జయ జానకి నాయక’ టైటిల్ అంటే చాలా ఇష్టం. అందుకే దానికి దగ్గరగా ఉండి.. కథలో భాగం అయ్యి ఈ సంక్రాంతి పండుగకు కూడా యాప్ట్ టైటిల్ అనిపించింది.
ఈ సినిమాలో మీ క్యారెక్టర్ బాగాఎలివేట్ అయ్యే యాంగిల్?
– ఈ సినిమాలో నా క్యారెక్టర్ ప్రతీ ఇంట్లో ఒక మంచి కొడుకు కానీ.. మంచి మరిది కానీ ఉంటే ఎలా ఉంటుందో అలా బ్యూటిఫుల్‌గా డిజైన్ చేసిన క్యారెక్టర్. పురాణాలలో చూసుకుంటే రాముడు అయోధ్యలో వినయంగా, యుద్ధం చేసేటప్పుడు ఎంత విధ్వంసంగా ఉంటాడో అలా ఉంటుంది. ప్రతీ మనిషిలో ఉండే ఈ రెండు కోణాలను సినిమాలో బోయపాటి గారు అద్భుతంగా ప్రజంట్ చేశారు.
ధ్రువ, రంగస్థలం లాంటి డిఫరెన్ట్ స్టోరిస్ తర్వాత యాక్షన్ మూవీ చేయడం ఎలా అనిపించింది?
– ఒక ఆర్టిస్ట్‌గా ఒకే జోనర్‌కి పరిమితం కాకుండా అన్ని జోనర్స్‌లో చేయాలనేది నా కోరిక. 80 లో నాన్న గారు అతి తక్కువ టైంలో అన్ని జోనర్స్‌లో నటించిన సందర్భాలు ఉన్నాయి. ఇక్కడ జోనర్స్ కంటే కూడా సెన్సిబుల్ మూవీస్ చేయడం ముఖ్యం.
దర్శకుడు బోయపాటి శ్రీను గురించి?
– బోయపాటి గారు ప్రస్తుతం ఉన్న వారిలో వన్ ఆఫ్ ది సక్సస్‌ఫుల్ కమర్షియల్ డైరెక్టర్. సినిమా పై ఆయనకు ఉన్న క్లారిటీ కానీ కన్వెక్షన్ కానీ నిజంగా చాలా గొప్పవి. ఆయన అన్ని సినిమాలో మంచి లవ్ స్టోరీ ఉంటుంది. ఈ సినిమాలో వయిలెన్స్ ఎక్కువగా ఉండదు. కథకు, సందర్భానికి తగ్గట్టుగానే ఆయన డిజైన్ చేశారు. ఈ సినిమాలో వచ్చే రాంబో సీన్ కూడా బోయపాటి గారు నాకు రెండు సంవత్సరాల క్రితమే నాకు చెప్పారు. ఆ సన్నివేశాల విషయంలో బోయపాటి గారు అస్సలు కంప్రమైజ్ కాలేదు. సినిమాకు ఆఎపిసోడ్ వన్ అఫ్ ది హైలెట్ అవుతుంది.
మీ నాన్న గారి గ్యాంగ్ లీడర్ సినిమాకు దగ్గరగా ఉంటుంది అంటున్నారు?
– అలా ఎందుకు అంటున్నారో నాకు అర్ధం కావడం లేదు. ఇది టోటల్‌గా డిఫరెంట్ సబ్జెక్ట్. ప్రతి సినిమాలో ఫ్యామిలీ అనేది ఉంటుంది. అంతమాత్రాన వేరే సినిమాతో ఎలా పోల్చుతారు. నేను ఎప్పటినుంచో ‘గ్యాంగ్ లీడర్’ లాంటి సినిమా చేయాలనుకుంటున్నాను. కానీ.. ఇది ఆ సినిమా అని నేను అనుకోవడంలేదు.
ఈ సినిమాలో ఇబ్బంది పడ్డ సందర్భాలు ఏమైనా ఉన్నాయా?
– ప్రతీ సినిమాలో కొన్ని సందర్భాలు డెఫినెట్‌గా ఉంటాయి. నా విషయానికి వస్తే ఈ సినిమాలో పెద్ద పెద్ద డైలాగ్స్ చెప్పడం కొంచెం ఇబ్బందిగా అనిపించింది.
ధ్రువ సినిమా తరువాత మీ వ్యక్తిత్వంలో చాలా చేంజెస్ వచ్చాయి?
– కలెక్షన్స్ విషయంలో లాస్ట్ ఇయర్ మహేష్ బాబు గారి ‘భరత్ అనే నేను’ సినిమా ,’రంగస్థలం’, అల్లు అర్జున్ ‘సరైనోడు’ సినిమాల కలెక్షన్స్ విషయంలో విభేదాలు వచ్చాయి. అది అవసరమా..అనిపించింది. మేము అందరం హ్యాపీగా మంచి సినిమాలు చేశాం. మా అందరి ప్రొడ్యూసర్స్ హ్యాపీ…ఈ చిన్న అంశంతో మా మధ్య మనస్పర్థలు రావడం ఇష్టం లేక మా ఫ్యాన్స్ తరపున కలెక్షన్స్ పెట్టొద్దు అని రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఇక బాండింగ్ విషయంలో మేము ఎప్పుడూ అలానే ఉండే వాళ్ళం ఈ మధ్య సోషల్ మీడియా వచ్చింది కాబట్టి అందరికి తెలుస్తుంది. కాని తారక్ నేను రెగ్యులర్‌గా కలిసే వాళ్ళం. మహేష్ బాబుతో ఈ మధ్య ఎక్కువగా ఇంటరాక్ట్ అవుతున్నాను. అందరిని కలుపుకు పోవడం అనేది నాన్నగారే చైన్నైలో స్టార్ట్ చేశారు. అదే నేను ఫాలో అవుతున్నాను. నా వ్యక్తిత్వంలో ఎలాంటి చేంజెస్ లేదు.
ఈ సినిమాలో హ్యుజ్ స్టార్ కాస్ట్ గురించి చెప్పండి?
– స్నేహ గారితో నాకు మంచి వర్కింగ్ ఎక్స్‌పీరియన్స్ ఉంది. అలాగే ఆర్యన్ రాజేష్ గారు చాలా కాలం తరువాత తెరపైన కనపడడం హ్యాపీ. ప్రశాంత్ గారు అందరికి నచ్చిన మంచి ఆర్టిస్ట్. ‘రక్త చరిత్ర’ సినిమా చూసి వివేక్ ఒబెరాయ్ గారిని ఈ రోల్ కోసం తీసుకోవడం జరిగింది. ఇలాంటి ఫైన్ ఆర్టిస్టులతో కలిసి నటించడం నిజంగా నా అదృష్టం.
సైరా షూటింగ్ షెడ్యూల్ విషయంలో ప్రొడ్యూసర్‌గా మీరు హ్యాపీనా?
– ‘సైరా’ చాలా పెద్ద సినిమా. ఇలాంటి సినిమాలకు కొన్ని కొన్ని కారణాల మినహా మిగతా షూటింగ్ సజావుగానే జరుగుతుంది. బడ్జెట్‌లోనే జరుగుతుంది. ప్రొడక్షన్ టీం, డైరెక్టర్స్ టీం చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు. ఇంకో రెండు నెలలలో షూటింగ్ కంప్లీట్ అవుతుంది. ఈఇయర్ సెకండ్ హాఫ్‌లో సినిమా విడుదలకు ప్లానింగ్ జరుగుతుంది. ‘సైరా’ కోసం నాన్న గారికి నిర్మాతగా నేను ఇచ్చిన రెమ్యూనరేషన్ తెలుగు ఇండస్ట్రీలో ఇంతవరకు ఎవ్వరూ ఇచ్చిఉండరు.
సౖౖెరా మ్యూజిక్ డైరెక్టర్ అమిత్ త్రివేది గురించి?
– పాటలు షూటింగ్ జరుగుతుంది. ఈ మధ్య కాలంలో ఒక ట్యూన్ వచ్చిన తరువాత ఇమ్మిడియట్‌గా ఎలాంటి మార్పులు లేకుండా ఓకే చేసిన ట్యూన్ అమిత్ త్రివేది దే, యూవీ క్రియేషన్స్‌లో ప్రభాస్ చేసే సినిమాకు కూడా అమిత్ మ్యూజిక్ డైరెక్టర్ అని విన్నాను. వెరీ సెన్సిబుల్ మ్యూజిక్ డైరెక్టర్.
రంగస్థలం సినిమాకు బెస్ట్ యాక్టర్ అవార్డ్ వచ్చింది కదా ఎలా ఎంజాయ్ చేస్తున్నారు?
– వెరీ వెరీ హ్యాపీ… చేసిన పనికి మంచి అప్రీిసియేషన్ ఉన్నప్పుడు నాకు, ఎంటైర్ టీంకు కూడా చాలా ఉత్సాహంగా అనిపిస్తుంది. ‘రంగస్థలం’ సినిమా చాలా రోజుల తరువాత నేను, సుకుమార్‌గారు కలిసి భోజనం చేస్తూ ఓకే చేసిన కథ. చిట్టిబాబు క్యారెక్టర్ చాలా ఎంజాయ్ చేస్తూ చేశాను.
ప్రొడ్యూసర్ దానయ్య డి.వి.వి గురించి?
– నేను ఇంతకు ముందు చెప్పినట్టు దానయ్య గారు పెద్ద సినిమాలకు బ్రాండ్ అంబాసిడర్ అయ్యారు. ఆయనతో కలిసి సినిమా చేయ్యడం చాలా హ్యాపీ. చాలా గట్స్ ఉన్న ప్రొడ్యూసర్, మరిన్ని గట్స్ ఉన్న బ్యానేర్ కావడంతో నెక్స్ట్.. నాన్న గారు కొరటాల శివ డైరెక్షన్ లో రాబోయో సినిమా కూడా ఈ బ్యానేర్‌లోనే ప్లాన్ చేస్తున్నాం.
రాజమౌళి ఆర్.ఆర్.ఆర్ సినిమా విశేషాలు?
ఆర్.ఆర్.ఆర్ సినిమాలో కామన్‌మాన్‌కి చాలా దగ్గరగా ఉండే డీ-గ్లామర్ క్యారెక్టర్. తప్పకుండా కామన్ మ్యాన్‌కు కనెక్ట్ అవుతుంది. తారక్‌కు నాకు మంచి బాండింగ్ ఉండడంతో సినిమా ఫస్ట్ షెడ్యూల్ హ్యాపీగా పూర్తయింది. సెకండ్ షెడ్యూల్ సంక్రాంతి పండుగ తరువాత ప్లాన్ చేస్తున్నారు రాజమౌళి గారు. ‘సైరా’ సినిమా ప్రొడక్షన్ పనులు అన్ని పూర్తిచేసుకొని ఆర్.ఆర్.ఆర్ సినిమాకు ఒక నటుడిగా నా 100 పెర్సెంట్ ఎఫర్ట్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఫుల్‌ఫ్లెడ్జ్డ్ ఎంటర్‌టైనర్‌గా రాజమౌళి గారు ఆర్.ఆర్.ఆర్‌ను తెరకెక్కిస్తున్నారు.