సత్యభామ కోసం మరో స్పెషల్ గెస్టు
గతేడాది భగవంత్ కేసరితో మంచి హిట్ అందుకున్న టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ ఇప్పుడు సత్యభామ అనే ఫీమేల్ సెంట్రిక్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాతో సుమన్ చిక్కాల దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. కాజల్ పోలీసాఫీసర్ గా నటిస్తున్న ఈ సినిమా ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ గా రూపొందనుందని ట్రైలర్ ను చూస్తుంటే అర్థమవుతుంది.
సత్యభామ జూన్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకు వీలైనంత బజ్ పెంచడానికి కాజల్ సినిమాను తెగ ప్రమోట్ చేస్తోంది. దాని కోసం కాజల్ తనకున్న పరిచయాలన్నింటినీ వాడుకుంటుంది. కాజల్ టాలీవుడ్ లో స్టార్ హీరోలందరితో జత కట్టింది. ఆ హీరోలందరితో కాజల్ కు మంచి బాండింగ్ ఉంది. తన కెరీర్ స్టార్టింగ్ లో కాజల్ రామ్ చరణ్ తో కలిసి నటించిన విషయం తెలిసిందే.
అప్పటి నుంచి ఇద్దరి మధ్యా మంచి బాండింగ్ ఉంది. ఈ నేపథ్యంలోనే సత్యభామ ప్రమోషన్స్ కోసం రామ్ చరణ్ ను తీసుకురాబోతుందట కాజల్. సత్యభామ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు రామ్ చరణ్ చీఫ్ గెస్టుగా వచ్చే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై చిత్ర యూనిట్ అధికారికంగా ఎలాంటి ప్రకటనా చేయలేదు. ఒకవేళ చరణ్ ఈవెంట్ కు వస్తే మాత్రం సత్యభామ సినిమాకు అది కచ్ఛితంగా ప్లస్ అవనుంది.













