చరణ్ బర్త్ డే అప్డేట్స్ ఇవే
మార్చి 27న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బర్త్ డే వస్తోంది. ప్రతీ సంవత్సరం వచ్చే బర్త్ డే అయినా ఈసారి చరణ్ ఫ్యాన్స్ ఆ రోజు కోసం మరింత ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. ఈసారి చరణ్ బర్త్ డే కు తన తర్వాతి సినిమాల అప్డేట్స్ రానున్నాయి. రీసెంట్ గానే చరణ్ బర్త్ డే కు అప్డేట్ ఉంటుందని నిర్మాత దిల్ రాజు అనౌన్స్ చేశాడు.
తర్వాత ఓ ప్రోగ్రాంలో తమన్ కూడా చరణ్ బర్త్ డేకు గేమ్ ఛేంజర్ నుంచి సాంగ్ ను రిలీజ్ చేయనున్నట్లు చెప్పాడు. దీంతో గేమ్ ఛేంజర్ నుంచి వచ్చే అప్డేట్ ఫస్ట్ లిరికల్ అని క్లారిటీ వచ్చేసింది. ఫస్ట్ సాంగ్ తో పాటూ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేస్తారా అంటే అది డౌటే. ప్రస్తుతం శంకర్ తో చర్చలు జరుగుతున్నాయట. ఈలోపు క్లారిటీ వస్తే రిలీజ్ డేట్ తో కలిపి పాటను రిలీజ్ చేస్తారు లేదంటే సాంగ్ ఒక్కటే రిలీజవుతుంది.
దీంతో పాటూ బుచ్చిబాబు దర్శకత్వంలో చరణ్ చేయబోయే సినిమా యొక్క టైటిల్ ను కూడా అనౌన్స్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఫస్ట్ లుక్ రిలీజ్ చేద్దామంటే చరణ్ ఇంకా ఈ సినిమాకు సంబంధించిన మేకోవర్ ను ఇంకా స్టార్ట్ చేయలేదు. దీంతో ఈ సినిమా నుంచి కేవలం టైటిల్ వరకే అనౌన్స్ కానుంది. ఇప్పటికే టైటిల్ డిజైన్ పూర్తైందని టాక్. ఈ రెండు కాకుండా చరణ్ 17వ సినిమా డైరెక్టర్ గా సుకుమార్ ను లాక్ చేస్తూ మైత్రి నుంచి మరో అనౌన్స్మెంట్ రానుందని అంటున్నారు. ఇందులో ఎంతవరకు నిజముందనేది తెలియాల్సి ఉంది. వీటన్నటింతో పాటూ నాయక్ రీరిలీజ్ కూడా కానుంది. మొత్తానికి ఈసారి చరణ్ ఫ్యాన్స్ కు అప్డేట్స్ బాగానే ఉండనున్నాయి.













