Rakul Preeth Singh: ఆ వాలెంటైన్స్ డే జీవితాంతం గుర్తుంటుంది: రకుల్
ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన రకుల్ ప్రీత్ సింగ్(rakul Preeth Singh) తెలుగు లోని అగ్ర హీరోలందరితో సినిమాలు చేసింది. ప్రస్తుతం రకుల్ తన భర్త నిర్మాణంలో ఓ సినిమాలో నటిస్తోంది. బాలీవుడ్ యాక్టర్ కం ప్రొడ్యూసర్ జాకీ భగ్నానీ(Jocky Bhagnani)ని రకుల్ ప్రేమించి మరీ పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. 2021 నుంచి ప్రేమించుకుంటున్న వారు గత ఫిబ్రవరిలో పెళ్లి చేసుకున్నారు.
2022 నుంచి తామిద్దరూ డేటింగ్ లో ఉన్నామని చెప్తున్న రకుల్, అదే సంవత్సరంలో తాము మొదటి వాలెంటైన్స్ డే చేసుకున్నట్టు తెలిపింది. ఓ హోటల్లోని గ్రీన్ హౌస్ ఏరియాలో జాకీ క్యాండిల్ లైట్ డిన్నర్ ఏర్పాటు చేశాడని, అక్కడే ఓ వైపు గిటారిస్టులు పాటలు పాడుతూండగా అవి వింటూ ఎంతో సంతోషంగా డిన్నర్ చేశామని చెప్పింది రకుల్.
ఆ తర్వాత జాకీ తన కోసం గులాబీ పువ్వులు, బొకేలు తీసుకొచ్చి ఇచ్చి ఎంతో సర్ప్రైజ్ చేశాడని, తన జీవితంలో ఎప్పటికీ ఆ వాలెంటైన్స్ డే ను మర్చిపోలేనని రకుల్ తెలిపింది. జాకీ లాంటి భర్త రావడం తన అదృష్టమని చెప్తున్న రకుల్ తన భర్త వల్లే తాను పెళ్లికి ముందు ఎలా ఉన్నానో ఇప్పటికీ అలానే ఉన్నానని చెప్పింది.













