Rakul Preeth Singh: బిజీగా ఉంటేనే ప్రశాంతత
టాలీవుడ్ ఆడియన్స్ కు రకుల్(Rakul) గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. టాలీవుడ్ లోని స్టార్ హీరోలందరితో కలిసి నటించిన రకుల్ తనదైన ముద్ర వేసుకుంది. రకుల్ నుంచి ఆఖరిగా వచ్చిన ఇండియన్2(Indian2), మేరే హస్బెండ్ కీ బీవీ(Mere Husband ki biwi) మూవీస్ బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయాయి. ప్రస్తుతం దే దే ప్యార్ దే2(De De pyar De2) చేస్తున్న రకుల్ రీసెంట్ గా ఓ ఇంటర్యూలో పాల్గొని కొన్ని ఇంట్రెస్టింగ్ అంశాలపై మాట్లాడింది.
సినీ ఇండస్ట్రీలో హిట్టూ, ఫ్లాపులు కామన్ అని చెప్తున్న రకుల్, లైఫ్ లో మార్పులు సహజమని, ఎన్ని కష్టాలొచ్చినా వాటిని రెట్టింపు ఉత్సాహంతో ఎదుర్కొని ముందుకెళ్లాలని, ముందు మనమీద మనకు నమ్మకం ఉండాలని అప్పుడే ఏదైనా సాధ్యమవుతుందని రకుల్ చెప్పింది. యాక్టింగ్ తన వృత్తి మాత్రమే కాదని, అది తన పొజిషన్ అని కూడా చెప్పింది రకుల్.
షూటింగ్ లేకుండా ఖాళీగా ఉంటే ఎంతో ఒత్తిడికి లోనవుతుంటానని చెప్తోన్న రకుల్, వరుస షూటింగ్ షెడ్యూల్స్ తో ఎంత బిజీగా ఉంటే తాను అంత ప్రశాంతంగా ఉంటానని అంటోంది. డైలీ కెమెరా ముందుకు వెళ్లడం తన దినచర్యగా మారిపోయిందని, అదే తనను ఇండస్ట్రీలో మంచి స్థానంలో ఉంచిందని, ఈ జర్నీ ఇలానే కొనసాగాలని కోరుకుంటున్నట్టు రకుల్ వెల్లడించింది.













