Rakul Preeth Singh: షైనింగ్ డ్రెస్లో రకుల్ స్టన్నింగ్ పోజులు
కొన్నాళ్ల కిందట వరకు టాలీవుడ్ లో వరుస సినిమాలతో దూసుకెళ్లిన రకుల్ ప్రీత్ సింగ్(Rakul Preeth Singh) ప్రస్తుతం బాలీవుడ్ కు వెళ్లిపోయింది. అక్కడ వరుస అవకాశాలు అందుకుంటున్న రకుల్ ఆ స్థాయిలో హిట్లు మాత్రం అందుకోలేకపోతుంది. ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే రకుల్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటోంది. ఎప్పటికప్పుడు తన కొత్త ఫోటోలను అప్లోడ్ చేస్తూ ఫ్యాన్స్ కు టచ్ లో ఉండే రకుల్ తాజాగా నెట్టింట కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఆ ఫోటోల్లో రకుల్ వన్ పీస్ షైనింగ్ డ్రెస్ వేసుకుని రకరకాల పోజులతో కుర్రాళ్ల గుండెల్లో సెగలు రేపింది. నెటిజన్లు ప్రస్తుతం ఆ ఫోటోలకు లైకుల వర్షం కురిపిస్తున్నారు.













