Rakul Preeth Singh: బట్టలు ఫ్రీ గా వచ్చినా లక్షలు ఖర్చు పెట్టాలి: రకుల్
సెలబ్రిటీలకు ఎలాంటి ఖర్చులుండవు. వాళ్లు ఎక్కడికి వెళ్లాలన్నా, ఎలాంటి బట్టలు వేసుకున్నా అన్నీ ఫ్రీ నే అనుకుంటూ ఉంటారంతా. కానీ సెలబ్రిటీలకు ఎవరికీ తెలియని ఖర్చులుంటాయని, బట్టలు ఫ్రీ గా ఇచ్చినా మేకప్, హెయిర్ స్టైలిస్టులకు తాము ఎంతో డబ్బు ఖర్చు పెట్టాల్సి ఉంటుందని రకుల్ ప్రీత్ సింగ్(Rakul Preeth Singh) తెలిపింది.
సెలబ్రిటీలు బయటికొచ్చినప్పుడు అందంగా కనిపించాలంటే దానికి కారణం కేవలం బట్టలు మాత్రమే కాదని, ఎంతోమంది శ్రమ ఉంటుందని, కేవలం ఒక్క లుక్ కోసం తాము రూ.20 వేల నుంచి రూ.లక్ష ఖర్చు పెట్టాల్సి వస్తుందని, హెయిర్ స్టైలిస్ట్, మేకప్ కోసం, ఫోటోగ్రాఫర్ల కోసం ఇలా ప్రతీ ఒక్కరికీ డబ్బు ఇవ్వాల్సి ఉంటుందని రకుల్ చెప్పింది.
అయితే తన లుక్ ను సెట్ చేయడం కోసం తన దగ్గర ఒక టీమ్ ఉందని, ఆరేళ్లుగా తన దగ్గర మేకప్, హెయిర్ స్టైలింగ్ కోసం ఓ స్పెషల్ టీమ్ వర్క్ చేస్తుందని, వాళ్లను కూడా తాను కుటుంబ సభ్యుల్లానే చూసుకుంటానని రకుల్ తెలిపింది. ఈవెంట్స్ కోసం బట్టలు ఫ్రీ గా వచ్చినా, దాని కొరియర్ ఛార్జ్ ల నుంచి ఆ డ్రెస్ ను ఫైనల్ లుక్ కు తెచ్చేవరకు సెలబ్రిటీలు ఎంతో ఖర్చు పెట్టాల్సి ఉంటుందని రకుల్ ఎవరికీ తెలియని విషయాల్ని వెల్లడించింది.













