Rakul Preeth Singh: వైట్ కార్సెట్ టాప్లో రకుల్ స్టన్నింగ్ పోజులు
ఒకప్పుడు టాలీవుడ్లో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన రకుల్ ప్రీత్ సింగ్(Rakul Preeth Singh) ప్రస్తుతం తెలుగులో సినిమాలు చేయడం లేదు. అమ్మడి ఫోకస్ మొత్తం బాలీవుడ్ పైనే ఉంది. అయితే సినిమాలు చేయకపోయినా సోషల్ మీడియా ద్వారా అమ్మడు అందరికీ టచ్ లోనే ఉంది. తాజాగా రకుల్ పోస్ట్ చేసిన ఓ ఫోటోషూట్ నెట్టింట వైరల్ అవుతుంది. ఈ ఫోటోల్లో రకుల్ వైట్ కలర్ కార్సెట్ టాప్, బ్లాక్ కార్గో ప్యాంట్ వేసుకుని, స్టైలిష్ పోజులతో ఎట్రాక్ట్ చేస్తుంది. ఈ డ్రెస్ లో అమ్మడు తన నడుము అందాలను హైలైట్ చేస్తూ దిగిన ఫోటోలకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.













