ఎన్ టీఆర్ బయోపిక్ …రకుల్ ఫస్ట్ లుక్ విడుదల
నందమూరి తారక రామారావు జీవితాధారంగా తెరకెక్కుతున్న చిత్రం యన్‌టిఆర్. క్రిష్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఎన్టీఆర్ పాత్రలో బాలకృష్ణ నటిస్తున్నారు. ఈ చిత్రంలో అలనాటి తారా శ్రీదేవి పాత్రలో రకుల్ ప్రీత్ సింగ్‌ను ఎంపిక చేసుకున్నారు. కాగా ఈ సినిమాలో శ్రీదేవిగా కన్పించబోతున్న రకుల్ ఫస్ట్‌లుక్‌ను ఆమె పుట్టినరోజు సందర్భంగా చిత్రబృందం విడుదల చేసింది. తెల్లటి బొట్టు, చీర కట్టులో రకుల్ శ్రీదేవిలా అందంగా కనిపిస్తున్నారు. ఎన్టీఆర్, శ్రీదేవిలది హిట్ కాంబినేషన్. వీరిద్దరూ కలిసి నటించిన సినిమాలన్నీ విజయవంతం అయ్యాయి. అలాంటి చిత్రాల్లో వేటగాడు ఒకటి. ఈ చిత్రంలోని ఆకు చాటు పిందె తడిసె పాట అప్పట్లో మాస్‌ని ఉర్రూతలూగించింది. ఇప్పుడు ఈ పాటని బాలకృష్ణ-రకుల్‌లపై తెరకెక్కిస్తారని వార్తలు వెలువడ్డాయి. ఇప్పుడు రకుల్ లుక్ చూడబోతే ఈ వార్తలు నిజమే అనిపిస్తున్నాయి. ఎన్టీఆర్, శ్రీదేవి కాంబినేషన్లో వచ్చిన మరికొన్ని హిట్ పాటల్ని ఈ బయోపిక్‌లో చూపించే అవకాశాలు కనిపిస్తున్నాయి.













