సిద్ధార్థకు జోడీగా రకుల్ ?
కమల్ హాసన్ కథానాయకుడిగా నటిస్తున్న భారతీయుడు 2లో కాజల్ అగర్వాల్ కథానాయిక. దర్శకుడు శంకర్ తాజాగా రకుల్‌ప్రీత్ సింగ్‌నూ ఎంపిక చేశారు. ఆగస్టు నుండి సినిమా చిత్రీకరణలో ఆమె పాల్గొనున్నారు. కాజల్, రకుల్ వీరిద్దరూ ఇద్దరు నాయికలున్న చిత్రాలు చాలా చేశారు. కానీ ఇద్దరు కలిసి ఏ చిత్రంలో నటించలేదు. ఇదే తొలి చిత్రం. అయితే ఇక్కడో ట్విస్ట్ ఉంది. కమల్‌కి జోడీగా కాజల్ నటిస్తుంటే. సిద్ధార్థ్‌కి జోడీగా రకుల్ కనిపించనున్నారు. ఇటీవల దర్శకుడు ఆమెకు కథ వినిపించగా వెంటనే ఒకే చెప్పేశారట. యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న ఈ చిత్రంలో ఐశ్వర్యా రాజేశ్, ప్రియా భవానీ శంకర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.













