ఆ విషయం కాలా చూస్తే తెలుస్తుంది
సూపర్‌స్టార్ నటించిన కాలా చిత్రం జూన్ 7న విడుదల కాబోతోంది. పా.రంజిత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రజనీ భార్యగా ఈశ్వరిరావు నటించారు. బాలీవుడ్ నటి హుమా ఖురేషి మరో కథానాయికగా నటించారు. ఈ సందర్భంగా రజనీ గురించి హుమా మీడియాతో మాట్లాడుతూ రజనీ సాధారణ వ్యక్తి. అసలు స్టార్‌డమ్‌ను ఆయన సీరియస్‌గా తీసుకోరు. మంచి మనసున్న మనిషి. ఆయనతో నటిస్తున్నప్పుడు నాకు ఇబ్బంది కలగకుండా చూసుకున్నారు. ఆయన పక్కనుండే వాళ్లు ఎంతో ప్రశాంతంగా ఉంటారు. నేను రజనీ నుంచి ఏం నేర్చుకున్నానో చెప్పను. ఆ విషయం మీకు కాలా సినిమాలో నా పాత్ర చూస్తే అర్థమవుతుంది. ఇందులో నేను జరీనా అనే పాత్రలో నటించాను. ఇలాంటి పాత్రలో నేను నటించం ఇదే మొదటిసారి అన్నారు.













