Jailer2: జైలర్2 ముహూర్తం ఫిక్స్?
కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth) హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్(Nelson Dileep Kumar) దర్శకత్వంలో వచ్చిన జైలర్(Jailer) సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పుడు దానికి సీక్వెల్ గా జైలర్2(Jailer2) కు సన్నాహాలు జరుగుతున్నాయి. రజినీకాంత్ కూడా ఈ సీక్వెల్ కు సిగ్నల్ ఇవ్వడంతో డైరెక్టర్ నెల్సన్ జైలర్2 పనుల్లో బిజీగా ఉన్నాడు.
తాజా సమాచారం ప్రకారం జైలర్2 స్క్రిప్ట్ రెడీ అయిందని, ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ శరవేగంగా జరుగుతున్నాయని తెలుస్తోంది. రజినీ డేట్స్ ఇవ్వడం ఆలస్యం సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లాలని చూస్తున్నాడట నెల్సన్. ఈ నేపథ్యంలో జైలర్2 కు ముహూర్తం పెట్టినట్లు తెలుస్తోంది. మార్చిలో రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయాలని చూస్తున్నారట.
త్వరలోనే దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుందని సమాచారం. జైలర్ సినిమాలో కంటే ఇందులో రజినీకాంత్ పాత్రను మరింత స్టైలిష్ గా చూపించబోతున్నారని, గెటప్ నుంచి కాస్ట్యూమ్స్ వరకు ప్రతీదీ ఫ్రెష్ ఫీల్ తీసుకొచ్చేలా నెల్సన్ ప్లాన్ చేశాడని సమాచారం. విలన్ గా నటించిన వినాయకన్(Vinayakan) పాత్రను కూడా డైరెక్టర్ చాలా బాగా డిజైన్ చేశాడని, రజినీ పాత్రకు ఏ మాత్రం తగ్గకుండా థగ్ ఆఫ్ వార్ లా ఉంటుందని యూనిట్ వర్గాలంటున్నాయి.













