రజనీకాంత్ రూ. 50 లక్షల విరాళం
కరోనా వైరస్ మహమ్మారి దెబ్బకు సినిమాల షూటింగ్స్ అన్నీ రద్దయిన సంగతి తెలిసిందే. దీంతో చిన్న స్థాయి కళాకారులు ఆర్థిక సమస్యలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కనీసం నిత్యావసర సరుకులు కూడా కొనలేక ఇబ్బంది పడుతున్న పేద కళాకారులకు అండగా నిలవాలని ఫిల్మ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ సౌత్ ఇండియా (ఎఫ్ఈఎఫ్ఎస్ఐ) సంఘం అధ్యక్షుడు ఆర్కే సెల్వమణి పిలుపునిచ్చారు. దీంతో ఎఫ్‌ఈఎఫ్‌ఎస్‌ఐకు యాభై లక్షల విరాళాన్ని ప్రకటించారు రజనీకాంత్. అలాగే విజయ్ సేతుపతి పది లక్షల రూపాయలను విరాళంగా ఇచ్చారని కోలీవుడ్ టాక్. శివకుమార్, సూర్య, కార్తీ ముగ్గరూ కలిసి పది లక్షలను అనౌన్స్ చేశారు. ప్రకాష్‌రాజ్, పార్తీబన్ వంటి కొంతమంది నిత్యావసర సరుకులను సినీ కార్మికులకు అందించి తమ దాతృత్వాన్ని చాటుకుంటున్నారు.













