దర్బార్ డబ్బింగ్ పూర్తి
రజనీకాంత్ హీరోగా నటించిన చిత్రం దర్బార్. నయనతార నాయిక. నివేదా థామస్ ముఖ్య పాత్రధారి. మురుగుదాస్ దర్శకుడు. సుభాస్కరన్ నిర్మాత. సంక్రాంతికి విడుదల కానున్న ఈ సినిమా డబ్బింగ్ పనుల్ని పూర్తి చేశారు రజనీ. ఈ నెల 14న డబ్బింగ్ మొదలుపెట్టిన ఆయన (18తేదీ సోమవారం)తో పూర్తి చేశారని చిత్ర బృందం వెల్లడించింది. మురుగదాస్ మాట్లాడుతూ రజనీకాంత్‌తో దర్బార్ చేయడం ఒక కొత్త అనుభవాన్ని ఇచ్చింది. డబ్బింగ్ సెషన్ కోసం ఆయనతో కలిసి చేసిన ఈ ప్రయాణం ఎప్పటికీ గుర్తుంటుంది అన్నారు. సంగీతం: అనిరుధ్ రవిచంద్రన్, ఛాయాగ్రహణం: సంతోష్ శివన్.













