డబ్బింగ్లో రజనీకాంత్
దర్బార్‌లో కూర్చుని రజనీకాంత్ డబ్బింగ్ చెప్పేస్తున్నాడట. ఫ్యాన్స్ ఎగిరి గంతులేస్తున్నారు. రజనీ ఫ్యాన్స్ పోకస్ మొత్తం సంక్రాంతికి వస్తున్న దర్బార్ మీదే ఉందన్న విషయం తెలిసిందే. మురుగదాస్ తెరకెక్కిస్తోన్న సినిమా తెలుగు, తమిళ భాషల్లో ఫెస్టివ్ సినిమాగా రాబోతోంది. తాజాగా సినిమాకు సంబంధించిన డబ్బింగ్ ప్రాసెస్ మొదలైందట. ప్రస్తుతం రజనీకాంత్ తన పాత్రకు డబ్బింగ్ చెపుతున్నారు. పోలీస్ ఆఫీసర్ పాత్ర రజనీకి కొత్త కాకున్నా, ముంబై సౌత్‌జోన్ పోలీసు ఆఫీసర్‌గా దర్బార్‌లో కనిపించే విధానమే వేరుగా ఉంటుందన్న టాక్ ఫ్యాన్స్‌లో ఆసక్తిని పెంచుతోంది. రజనీకి జోడీగా నయనతార కనిపిస్తుంటే, కీలక పాత్రలో సునీల్ శెట్టి, నివేదా థామస్ కనిపించనున్నారు.













