నా కోసమే శివ కంగువ కథ రాశాడేమో: రజినీ
ఈ ఏడాది రానున్న భారీ పాన్ ఇండియా సినిమాల్లో కంగువ(Kanguva) ఒకటి. సూర్య(Suriya) హీరోగా సిరుత్తై శివ(Siruthai Siva) రూపొందించి ఈ సినిమా నవంబరు 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. కంగువ తమిళ సినిమా అయినప్పటికీ తెలుగు, హిందీ భాషల్లో ఈ సినిమాపై మంచి అంచనాలున్నాయి. ప్రస్తుతం చిత్ర యూనిట్ మొత్తం ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉంది.
ఇప్పటికే హైదరాబాద్లో ఈవెంట్ చేసేశారు. తాజాగా చెన్నైలో తమిళ వెర్షన్ ఆడియో రిలీజ్ జరిగింది. ఈ ఈవెంట్ కు సూపర్ స్టార్ రజినీకాంత్(rajinikanth) చీఫ్ గెస్టుగా రావాల్సింది. వాస్తవానికి కంగువ దసరాకు రావాల్సింది కానీ రజినీ సినిమా వేట్టయాన్(Vettayan) దసరాకు రిలీజ్ చేయాలని భావించడంతో రజినీ మీద ఉన్న అపార గౌరవంతో సూర్య(Suriya) తన సినిమాను వాయిదా వేసుకున్నాడు. ఈ నేపథ్యంలోనే రజినీ(Rajini) కంగువ ఆడియో లాంచ్ కు రావాలనుకున్నారు.
కానీ రీసెంట్ గా అనారోగ్యం కారణంగా కొన్నాళ్ల పాటూ షూటింగ్ కు దూరమైన రజినీ ఇప్పుడు బ్రేక్ తీసుకోకుండా కూలీ(Coolie) షూటింగ్ లో పాల్గొనడం వల్ల ఆడియో లాంచ్ కు రాలేకపోయాడు. ఈవెంట్ కు రాకపోయినా రజినీ కంగువ టీమ్ కోసం ఓ వీడియో మెసేజ్ పంపారు. రజినీతో శివ అన్నాత్తె (Annathe)సినిమా చేయడం వల్ల వారి మధ్య మంచి అనుబంధముంది.
అన్నాత్తె చేసేటప్పుడే శివ, రజినీ కలిసి ఓ పీరియాడిక్ మూవీ చేస్తే బావుంటుందని శివ చెప్పేవాడని బహుశా ఈ కంగువ కథ తన కోసమే రాసి ఉంటాడని, చివరకు అది సూర్య, జ్ఞానవేల్ రాజా దగ్గరికి చేరిందని రజినీ నవ్వుతూ అన్నారు. అంతేకాదు కంగువ ట్రైలర్ అద్భుతంగా ఉందని, సూర్య ఎంతో గొప్ప నటుడని, అతనికి కంగువ ద్వారా మంచి విజయం దక్కాలని రజినీ అన్నారు.













