రామ్ చరణ్ సరసన ఆలియాభట్ ?
బాలీవుడ్ నుంచి కథానాయికల దిగుమతి కొనసాగుతూనే ఉంది. విద్యాబాలన్, కియారా అడ్వాణీ లాంటి భామలు తెలుగులోనూ హవా చూపిస్తున్నారు. ఇప్పుడు ఆలియాభట్ కూడా తెలుగులో అరంగ్రేటం చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్‌చరణ్ కథానాయకులుగా ఓ చిత్రం రూపుదిద్దుకుంటోంది. ఇందులో ముగ్గురు కథానాయికలుంటారు. వాళ్లెవరో చిత్రబృందం అధికారికంగా ప్రకటించలేదు. కానీ పలువురు నాయికల పేర్లు ప్రచారంలో ఉన్నాయి. అందులో అలియాభట్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. రామ్‌చరణ్ సరసన ఆలియా కనిపించనుందని సమాచారం. ఎన్టీఆర్‌తో నటించే నాయికని ఎంపిక చేయాల్సి ఉంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఎన్టీఆర్, చరణ్‌లపై కీలక సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. డి.వి.వి దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు.













