Raja Saab: రాజా సాబ్.. ఆ టార్గెట్ అందుకోవడం కష్టమే!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) హీరోగా మారుతి(Maruthi) దర్శకత్వంలో చేస్తున్న హార్రర్ కామెడీ ది రాజా సాబ్(The Raja Saab). ఈ సినిమాలో ప్రభాస్‌ను మారుతి చాలా కొత్తగా ప్రెజెంట్ చేయబోతున్నట్లు ఇప్పటికే పలుసార్లు క్లారిటీ ఇచ్చాడు. ఇప్పటికే ఈ సినిమా కథ పరంగా మంచి ఆసక్తిని కలిగించింది. ప్రభాస్ మొదటిసారి ఈ జానర్ లో సినిమా చేస్తున్నాడు.
దీంతో సినిమాపై మంచి బజ్ నెలకొంది. ఈ సినిమాకు ముందు అనుకున్న ప్రకారమైతే ఏప్రిల్ 10న రిలీజ్ చేయాలి. కానీ ఇప్పుడది కుదిరేలా కనిపించడం లేదు. ఇంకా రాజా సాబ్ కు సంబంధించిన పెండింగ్ షూటింగ్ చాలానే ఉందట. మరో 80 రోజుల పాటూ రాజా సాబ్ షూటింగ్ బ్యాలెన్స్ ఉందని యూనిట్ వర్గాలంటున్నాయి.
షూటింగ్ తో పాటూ గ్రాఫిక్స్ వర్క్స్ కూడా పూర్తి చేయాల్సి ఉంది. వీటన్నింటినీ బట్టి చూస్తుంటే రాజా సాబ్ చెప్పిన రిలీజ్ డేట్ ను అందుకోవడం పెద్ద సవాలే. కానీ నిర్మాతలు మాత్రం సినిమాను ఆ లోపే రెడీ చేసి రిలీజ్ చేయాలని చూస్తున్నారు. ఎక్కువ రోజులు సినిమాను వాయిదా వేయకుండా రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్. మరి చూడాలి రాజా సాబ్ చివరకు ఎప్పుడు రిలీజవుతుందో.













