పుష్ప2కు వర్షాల బెడద
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కలయికలో వచ్చిన పుష్ప సినిమా ఎంతటి విజయాన్ని అందుకుందో తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు సీక్వెల్ గా పుష్ప2 సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమా షూటింగ్ పలు కారణాల వల్ల పోస్ట్‌పోన్ అవుతూ వస్తుంది. మొదట్లో ప్రీ ప్రొడక్షన్ వర్క్ కోసం ఏకంగా ఏడాది టైమ్ తీసుకున్న సుకుమార్ షూటింగ్ మొదలుపెట్టి దాదాపు సగానికి పైగా పూర్తి చేశాడు.
ముందు అనుకున్న ప్రకారం పుష్ప2 షూటింగ్ మళ్లీ తిరిగి ప్రారంభం కావాల్సి ఉంది. అవుట్ డోర్ లో జరగనున్న ఈ షెడ్యూల్ భారీ వర్షం కారణంగా క్యాన్సిల్ అయినట్లు తెలుస్తోంది. దీంతో వర్షాకాలం కారణంగా ముందు ముందు కూడా ఈ షెడ్యూల్ కి ఇబ్బందులు తప్పకపోవచ్చనుకుంటున్నారు యూనిట్ సభ్యులు.
గతంలోనూ పుష్ప2 షూటింగ్ కు వర్షం కారణంగా బ్రేక్ పడ్డ సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోసారి వర్షం కారణంగానే షూటింగ్ లేటవడం విశేషం. ఇదిలా ఉంటే ఇప్పటివరకు ఈ సినిమా రిలీజ్ డేట్ విషయంలో ఇప్పటివరకు మేకర్స్ నుంచి ఎలాంటి క్లారిటీ రాలేదు. చూస్తుంటే పుష్ప2 వచ్చే యేడాది సమ్మర్ కు వచ్చేట్లుంది.













