టైసన్ కు బ్రేక్ దక్కింది
సూపర్ హిట్ సినిమాతో పరిచయమైతే వాళ్లకు వరుసగా బ్రేక్ దొరకాలనేమీ లేదు. ఒకరికి త్వరగా మరొకరికి కాస్త లేట్ గా సక్సెస్ వస్తుంది. రాహుల్ టైసన్ కు కూడా అంతే. శేఖర్ కమ్ముల హ్యాపీ డేస్ సినిమాతో పరిచయమైన ఈ హీరో అందులో మంచి నటనతో ఆడియన్స్ ను మెప్పించాడు. వరుణ్ లాగే రాహుల్ కు కూడా బాగా ఆఫర్లు వస్తాయనుకుంటే అతనికి టైమ్ కలిసిరాలేదు.
అతను చేసిన రైన్ బో, ముగ్గురు సినిమాలు అనుకున్న ఫలితాన్నివ్వలేదు. అయితే రాహుల్ రీసెంట్ గా రిలీజైన భజే వాయు వేగం సినిమాలో కార్తికేయకు అన్నయ్యగా నటించాడు. భజే వాయువేగంలో రాహుల్ ను చూసిన ఆడియన్స్ అంతా ఆశ్చర్యపోయారు. సినిమాలో మంచి పాత్ర దక్కడంతో తన నటనతో మెప్పించడంలో రాహుల్ సక్సెస్ అయ్యాడు.
దీంతో ఇప్పుడు రాహుల్ కు వార్ బ్యాక్ డ్రాప్ లో ఒకటి, టైం ట్రావెల్ కాన్సెప్ట్ ఆధారంగా మరొకటి షూటింగ్ వెళ్లడానికి రెడీ అవుతున్నాయి. సరైన కథలు పడితే రాహుల్ కెరీర్ తిరిగి ఊపందుకునే ఛాన్స్ భజే వాయువేగంతో వచ్చింది. ఈ సినిమాలు క్లిక్ అయితే ఓటీటీ ఆఫర్లు కూడా రావడం ఖాయం. మొత్తానికి రాహుల్ టైసన్ కు కాస్త లేట్ గా అయినా సరే మంచి పాత్ర తో పాటూ గుర్తింపు దక్కింది.













