సినిమా చూసిన రాహుల్ గాంధీ
కాంగ్రెస్ అధ్యక్ష పదవికి అధికారికంగా రాజీనామా చేసిన రాహుల్ గాంధీ రిలాక్స్ అయ్యారు. రాజీనామాకు సంబంధించి నాలుగు పేజీల లేఖను విడుదల చేసిన రాహుల్..సామాన్య పౌరుడిలా ఆర్టికల్ 15 సినిమా చూశారు. పీవీఆర్ చాణక్య మల్టీఫ్లెక్స్‌లో ప్రేక్షకుల మధ్య కూర్చొని.. పాప్‌కార్న్ తింటూ రాహుల్ ఆ మూవీని చూసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నిలక్లో కాంగ్రెస్ పార్టీ ఘరో పరాజయం పాలైన విషయం తెలిసిందేప.. 542 లోక్‌సభ స్థానాలకు గానూ 52 స్థానాల్లో మాత్రమే గెలుపొందింది. దీంతో పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ రాహుల్ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు.













