నడిగర్ సంఘానికి రూ.25 లక్షలు
దర్శకుడు, నృత్య దర్శకుడు రాఘవ లారెన్స్ మరోసారి విరాళం ప్రకటించారు. నడిగర్ సంఘానికి రూ.25 లక్షలు ఇస్తున్నట్టు తెలిపారు. దీనికి సంబంధించి ఫేస్బుక్ ఖాతా నుంచి ఓ వీడియోను షేర్ చేశారు. అందులో సినీ కార్మికులు తమ సమస్యను వివరించారు. ఆ వీడియోను నటుడు ఉదయ్ పంపినట్టు రాఘవన్ తెలిపారు. ఇప్పుడే ఈ వీడియోను చూశాను. ఈ వీడియోను పంపినందుకు ఉదయ్ నీకు ధన్యవాదాలు. నడిగర్ సంఘానికి రూ.25 లక్షలు విరాళం ఇస్తున్నా ఓ చిన్న విన్నపం. నాకు యూనియన్ నుంచి, ప్రజల నుంచి చాలా వీడియోలు వస్తున్నాయి. నేనొక్కడినే. నా స్థాయికి తగ్గట్టు సాయం చేస్తున్నా. చాలా ఇబ్బందిగా మారింది. ఎవరైనా విరాళాలు ఇచ్చే వారుంటే నాతో మీరు చేరండి. ఒక్క రూపాయి అయినా సాయమే అని పేర్కొన్నారు. ఈయన ఇప్పటికే రూ.3 కోట్లు విరాళంగా ఇచ్చారు.













