షాకింగ్ డెసిషన్ తీసుకున్న రాధికా ఆప్టే…
రాధికా ఆప్టే పేరుకు ప్రత్యేకంగా పరిచయం అవసరంలేదు. టాలీవుడ్ లో నందమూరి నటసింహం బాలకృష్ణ తో “లెజెండ్, లయన్” సినిమాల్లో జత కట్టింది ఈ ముద్దుగుమ్మ. తమిళంలో సైతం సూపర్ స్టార్ రజినీకాంత్ తో కలిసి నటించి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. ఇటు బాలీవుడ్, అటు సౌత్ సినిమాలతో పాటు హాలీవుడ్ సినిమాలను కూడా కవర్ చేసింది రాధికా. సూపర్ స్టార్స్ తో నటించి ఈ అమ్మడు మంచి పేరును దక్కించుకున్న విషయం తెల్సిందే.
రాధికా తాను నటించిన హీరోలపై విమర్శలు, కామెంట్లు చేయడం ద్వారా పలుసార్లు వార్తల్లో నిలిచింది. ఈ తరుణంలో ఈమె హీరోయిన్ కంటే కూడా కాంట్రవర్సీలతోనే ఎక్కువ పాపులర్ అయ్యింది అని చెప్పొచ్చు. సౌత్ హీరోల యొక్క డామినేషన్ ఎక్కువ ఉంటుందని, వారు హీరోయిన్స్ కు గౌరవం ఇవ్వరు అంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన విషయం తెల్సిందే. ఈ విమర్శల కారణంగానే ఈ అమ్మడికి సౌత్ లో అవకాశాలు కనుమరుగయ్యాయని గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఎప్పుడూ ఏదో ఒక కాంట్రావెర్సీ లో ముందుండే ఈ హీరోయిన్ తాజాగా బిగ్ డెసిషన్ తీసుకున్నట్లుగా ఇండస్ట్రీలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఇంతకాలం హీరోయిన్ గా నటించిన రాధిక ఆప్టే ఇకమీదట దర్శకురాలిగా మారాలని భావిస్తుందట. అసలైతే నేను హీరోయిన్ అవ్వాలని అనుకోలేదు, దర్శకురాలు అవ్వాలనే ఉద్దేశ్యంతో డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో శిక్షణ కూడా తీసుకున్నానని చెప్పింది ఈ ముద్దుగుమ్మ. కానీ, సడెన్ గా హీరోయిన్ గా ఛాన్స్ రావడం జరిగిందట.
రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో రాధికా మాట్లాడుతూ, దర్శకురాలు అవ్వాలనే కోరిక తనలో ఇంకా ఉందని చెప్పారు. త్వరలోనే తాను దర్శకురాలిగా సినిమా తీయబోతున్నట్లుగా ప్రకటించింది. ప్రస్తుతం స్క్రిప్ట్ రైటింగ్ కోసం సీనియర్ దర్శకుల వద్ద సలహాలు, సూచనలు తీసుకుంటూ వారికి అసిస్టెంట్ గా బిజీగా ఉన్నాను అని చెప్పింది.
ఫ్యూచర్ లో ఇటు సౌత్ లో, అటు బాలీవుడ్ లో తన దర్శకత్వంలో సినిమాలు వస్తాయని ఆమె ధీమాగా చెప్పుకొచ్చింది. ఈ నేపథ్యంలో దిరెచ్తిఒన్ చేస్తున్నంత మాత్రాన నటిగా, హీరోయిన్ గా తన కెరీర్ కు బ్రేక్ ఇవ్వనని చెప్పకనే చెప్పింది ఈ అమ్మడు. ప్రెజెంట్ తన ఫస్ట్ ప్రయారిటీ నటన అని, దర్శకత్వం అనేది తనకు ఆసక్తి కనుక చేయాలని అనుకుంటున్నట్లుగా రాధిక ఆప్టే పేర్కొంది.













