చైతూ కు జోడీగా రాశీఖన్నా..
రాశీఖన్నాతెలుగులో చాలా సినిమాలు చేసినప్పటికీ, స్టార్ హీరోయిన్ గా ఎదగలేకపోయింది. జూనియర్ ఎన్టీఆర్, గోపీ చంద్, రామ్, వరుణ్ తేజ్, సాయి తేజ్ తో సినిమాలు చేసింది. అందం, అభినయం రాశీ సొంతమైనప్పటికీ, కాలం కలిసి రాకపోవడంతో సెకండ్ గ్రేడ్ హీరోయిన్ గానే మిగిలిపోయింది.
ప్రస్తుతం రాశీకి సరైన ఛాన్స్ లు కూడా రావట్లేదు. ఇలాంటి పీక్ టైమ్ లో రాశీకి ఒక బంపరాఫర్ వచ్చింది. చైతూ కు జంటగా, దర్శకుడు విక్రమ్ కుమార్ ఒక సినిమా మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ కూడా మొదలైంది. కానీ ఇప్పటి వరకు హీరోయిన్ ను మాత్రం ఇంకా ఫైనలైజ్ చేయలేదు.
తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమాలో రాశీ ఖన్నా ను తీసుకోనున్నట్లు తెలుస్తుంది. సరిగా ఆఫర్లు రాని టైమ్ లో ఈ ఆఫర్ రావడం రాశీ ఖన్నాకు ఖచ్చితంగా బంపరాఫర్ అనే చెప్పాలి. త్వరలోనే దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్ మెంట్ రానుంది. ఈ సినిమాకు థాంక్యూ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ఈ చిత్రాన్ని శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో దిల్ రాజు నిర్మిస్తున్నాడు.













