సినీ నటుడు ఆర్ నారాయణమూర్తికి అస్వస్థత.. ఆసుత్రిలో చేరిక
ప్రముఖ సినీ నటుడు, దర్శక నిర్మాత ఆర్ నారాయణ మూర్తి అస్వస్థతకు లోనయ్యారు. ఈ నేపథ్యంలో ఆయన హైదరాబాద్లోని నిమ్స్ ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నారు. డాక్టర్ బీరప్ప ఆధ్వర్యంలో ఆర్ నారాయణ మూర్తికి చికిత్స కొనసాగుతుండగా, ఆయన క్రమంగా కోలుకుంటున్నట్టు డాక్టర్లు వెల్లడిరచారు. దశాబ్దాలుగా హీరోగా, నిర్మాతగా, దర్శకుడిగా విప్లవ సినిమాలతో పాటు సామాజిక నేపథ్యం ఉన్న సినిమాలు తెరకెక్కిస్తూ పీపుల్స్ స్టార్ గా కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్నారు ఆర్ నారాయణమూర్తి. ఆయన ఆరోగ్యంగా తిరిగి రావాలని దేవుడిని ప్రార్థిస్తున్నారు అభిమానులు.













