ఒక్క రూపాయికే క్వార్టర్.. గంట మాత్రమే వ్యవధి.. ఓ వీరాభిమాని కొత్త ప్రయత్నం!
అన్ని దానాలలోకీ అన్నదానం గొప్పది అంటారు. ఎందుకంటే ఆకలి తీరిన తర్వాతే మరో అంశంపై ఆశ కలుగుతుంది. కానీ, ఇప్పుడు అన్నదానం కంటే గొప్పది మద్య దానం అంటున్నాడు ఓ వీరాభిమాని. తన అభిమాన దర్శకుడు ఎన్.శంకర్ పెళ్లిరోజును పురస్కరించుకొని మద్యాన్ని కారుచౌకగా (ఒక విధంగా దానం అనే చెప్పొచ్చు) విక్రయిస్తున్నాడు. రంగారెడ్డి జిల్లాకు చెందిన టిఆర్ ఎస్ నాయకుడు చింతకుంట విష్ణు అనే వ్యక్తి ఒక రూపాయికే క్వార్టర్ మద్యాన్ని అందించనున్నట్టు ప్రకటించాడు. తన అభిమాన దర్శకుడు ఎన్.శంకర్ పెళ్ళిరోజు నవంబర్ 16. ఆరోజు ఉదయం 11 గంటల నుంచి 12 గంటల మధ్యలో క్వార్టర్ మందును ఒక రూపాయికే అందిస్తానని తెలియజేస్తూ ఫ్లెక్సీలు కూడా వేయించాడు. ఈ ఫ్లెక్సీ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
తమ అభిమానాన్ని చాటుకునేందుకు ఒక్కొక్కరు ఒకో విధానాన్ని ఎంచుకుంటారు. విష్ణు మాత్రం మందుబాబులను టార్గెట్ చేశాడు. ఒక్క రూపాయికే మద్యం అనే కాన్సెప్ట్ అందరిలోనూ ఆసక్తిని రేపింది. సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ పోస్టర్‌కి మంచి రెస్పాన్స్ వస్తోంది. విష్ణుని ప్రశంసిస్తూ పోస్టులు పెడుతున్నారు. మందుబాబులు మాత్రం విష్ణుని ఎత్తేస్తున్నారు. ఒక్క రూపాయికే క్వార్టర్ ఇస్తున్న అతని ధాతృత్వాన్ని కొనియాడుతున్నారు. అతను పెట్టిన ఒక గంట సమయంలో ఎన్ని బాటిల్స్ అందించదలుచుకున్నాడు. ఆరోజు అక్కడ ఎంత రద్దీ ఉంటుందనేది అంచనా వేయలేకపోతున్నారు. ఈ కార్యక్రమం సక్సెస్ అయితే హీరోల అభిమానులు కూడా ఈ తరహా కార్యక్రమం చేపడతారేమో చూడాలి.













