Pushpa2: నాలుగు రోజులకే ఓటీటీలో పుష్ప2 రికార్డులు
అల్లు అర్జున్(Allu Arjun) నటించిన పుష్ప2(Pushpa2) సినిమా రిలీజై ఇప్పటికే రెండు నెలలైంది. డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులను సృష్టించడంతో పాటూ బాహుబలి2(Baahubali2) కలెక్షన్లను సైతం దాటేసి పుష్పరాజ్ దూసుకెళ్లాడు. సుకుమార్(Sukumar) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా నాలుగు రోజుల కిందట ఓటీటీలోకి వచ్చింది.
ఈ సినిమా నెట్ ఫ్లిక్స్(Netflix) లో కూడా రికార్డులు సృష్టిస్తోంది. పుష్ప2 మొదటిగా థియేటర్లలో 3 గంటల 21 నిమిషాల నిడివితో రిలీజైంది. తర్వాత మరో 25 నిమిషాలను యాడ్ చేయడంతో మొత్తం 3 గంటల 46 నిమిషాలైంది. ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ లో ఆ రీలోడెడ్ వెర్షన్నే రిలీజ్ చేశారు. తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ భాషల్లో పుష్ప2 స్ట్రీమింగ్ అవుతుండగా, హిందీ వెర్షన్ ఎప్పుడు రిలీజవుతుందో తెలియాల్సి ఉంది.
ఈ సినిమా పాశ్చాత్య ప్రేక్షకుల్ని కూడా ఆశ్చర్యపరుస్తూ, ఏడు దేశాల్లో నెం.1 స్థానంలో దూసుకెళ్తుంది. గ్లోబల్ నాన్ ఇంగ్లీష్ సినిమాల కేటగిరీలో పుష్ప2 నాలుగు రోజుల్లోనే 5.8 మిలియన్ల వ్యూస్ తో సెకండ్ ప్లేస్లో ఉండి, తెలుగు సినిమా స్థాయిని మరింత పెంచింది. నాలుగు రోజులకే పుష్ప రాజ్ రూల్ ఈ రేంజ్ లో ఉంటే మరో వారానికి ఏయే రికార్డులను బ్రేక్ చేస్తాడో అని అంతా భావిస్తున్నారు.













