Pushpa2: బాలీవుడ్ సినిమాకు తలనొప్పిగా మారిన పుష్ప2
అత్యంత వేగంగా రూ.600 కోట్ల గ్రాస్ దాటిన మొదటి ఇండియన్ సినిమాగా పుష్ప2 రికార్డు సృష్టించింది. పుష్ప2(Pushpa2) రిలీజై మూడో వారంలోకి ఎంటరైనప్పటికీ ఇంకా రన్ ఏమాత్రం తగ్గలేదు. నార్త్ లో దీని స్పీడు ఊహించలేకుండా ఉంది. షారుఖ్ ఖాన్(Shah Rukh Khan) జవాన్(Jawaan) ని సైతం దాటిన పుష్ప2కు ఎండింగ్ ఎక్కడుంటుందో కూడా అంతుచిక్కడం లేదు.
చూస్తుంటే జవనరి మొదటి వారం వరకు పుష్ప2కు ఇదే ఊపు ఉండబోతుందని అర్థమవుతుంది. ఇలాంటి టైమ్ లో వరుణ్ ధావన్(Varun Dhawan), కీర్తి సురేష్(Keerthy Suresh) జంటగా అట్లీ(Atlee) నిర్మించిన తేరి రీమేక్ బేబీ జాన్(Baby John) డిసెంబర్ 25న రిలీజ్ అవుతుంది. ఈ సినిమాకు కలీస్(Kalees) దర్శకత్వం వహించాడు. ప్రమోషన్స్ కూడా గ్యాప్ లేకుండా చేస్తున్నారు.
అయితే పుష్ప2 మత్తులో ఉన్న ఆడియన్స్ కు ఈ రొటీన్ పోలీస్ యాక్షన్ ఎంటర్టైనర్ ఏ మేరకు ఎక్కుతుందనే డౌట్స్ ఎగ్జిబిటర్లలలో కూడా ఉన్నాయి. అయినా సరే తమ సినిమాను ఆడియన్స్ కచ్ఛితంగా ఆదరిస్తారని నిర్మాతగా అట్లీ నమ్మకం వ్యక్తం చేస్తున్నాడు. సల్మాన్ ఖాన్(Salman Khan) క్యామియో చేసిన ఈ సినిమాకు తమన్(Thaman) సంగీతం అందిస్తున్నాడు. మొత్తానికి బేబీ జాన్ కు పుష్ప2 రూపంలో పెద్ద టెన్షనే ఉంది.













