పుష్ప2 లీకైన వీడియోతోనే గూస్ బంప్స్
ఒక రీజనల్ సినిమాగా వచ్చి, తర్వాత ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చుకున్న చిత్రంగా పుష్ప సినిమాకు స్పెషల్ క్రేజ్ ఉంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సృష్టించిన సంచలనాలు అన్నీ ఇన్నీ కావు. పుష్ప తర్వాత బన్నీ రేంజ్ కూడా మారిపోయింది. ఏకంగా ఈ సినిమాలో బన్నీ నటనకు నేషనల్ అవార్డ్ వచ్చిందంటే బన్నీ స్థాయి ఏంటో అర్థం చేసుకోవచ్చు.
ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్గా పుష్ప2 రాబోతున్న విషయం తెలిసిందే. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా కోసం సినీ లవర్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను వచ్చే యేడాది మార్చిలో రిలీజ్ చేయాలని దర్శకనిర్మాతలు గట్టిగా ప్లాన్ చేస్తున్నారు.
ఇదిలా ఉంటే ఈ సినిమా నుంచి ఫ్యాన్స్ ను సంతోషపరిచే ఓ వీడియో ఒకటి ఇప్పుడు బయటకు వచ్చింది. పుష్ప2 లొకేషన్ల నుంచి ఈ వీడియో లీకైనట్లు తెలుస్తోంది. వీడియోలో ఓ పెద్ద స్థలంలో కొన్ని వందల కొద్దీ లారీలున్నాయి. ఈ లారీలు మరేంటో కాదు ఎర్ర చందనం స్మగ్లింగ్ చేసే లారీలు. లీకైన ఈ వీడియో చూస్తేనే ఫ్యాన్స్ కు గూస్బంప్స్ రావడం గ్యారెంటీ అనిపిస్తుంది. దీన్ని బట్టి సెకండ్ పార్ట్ ను సుకుమార్ ఏ రేంజ్ లో ప్లాన్ చేశాడో అర్థం అవుతుంది.
మొదటి భాగంలో మించిన ఐడియాలను ఈ సినిమాలో సుకుమార్ హీరోతో వేయిస్తాడని, ఈ డిఫరెంట్ స్మగ్లింగ్ ఐడియాలు ఫ్యాన్స్ ను ఎంతగానో ఆకట్టుకుంటాయని యూనిట్ సభ్యులు చెప్తున్నారు. రష్మిక హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో ఫహద్ ఫాజిల్ విలన్ గా నటిస్తుండగా, దేవీ శ్రీ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.






