పూరీ అప్డేట్ అవాల్సిందే!
టాలీవుడ్ లో పూరీ జగన్నాథ్(Puri Jagannath)కు డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ అనే పేరుంది. ఒకప్పుడు స్టార్ హీరోలతో సినిమాలు చేసి బ్లాక్ బస్టర్ హిట్లు అందుకున్న పూరీకి గత కొన్ని సినిమాలుగా ఫ్లాపులే ఎదురవుతున్నాయి. తన సినిమాలన్నీ భారీ అంచనాలతో రిలీజవడం, రిలీజయ్యాక డిజాస్టర్లుగా మారడం కామనైపోయింది.
టెంపర్(Temper) తర్వాత పూరీ చేసిన సినిమాల్లో ఇస్మార్ట్ శంకర్(Ismart Shankar) తప్ప మరే సినిమా కమర్షియల్ గా వర్కవుట్ అవలేదు. తర్వాత చేసిన లైగర్(Liger), డబుల్ ఇస్మార్ట్(Double Ismart) సినిమాలు ఒకదాన్ని మించి మరొకటి డిజాస్టర్లయ్యాయి. అయితే డబుల్ ఇస్మార్ట్ తర్వాత పూరీ నెక్ట్స్ మూవీ ఏంటనే విషయంలో ఇప్పటికీ క్లారిటీ రాలేదు. కింగ్ నాగార్జున(King Nagarjuna) కోసం స్క్రిప్ట్ రెడీ చేసి నాగ్ ను ఒప్పించాలని ట్రై చేస్తున్నాడని టాక్ వినిపిస్తోంది.
రీసెంట్ గా పూరీ బర్త్ డే సందర్భంగా ఆయన నెక్ట్స్ మూవీ అప్డేట్ వస్తుందనుకున్న పూరీ ఫ్యాన్స్ కు నిరాశే మిగిలింది. ఆయన మంచి రైటర్ ఉన్నాడని, ఒకప్పుడు పూరీని చూసే ఎంతోమంది కథలు రాయడం మొదలుపెట్టారని, ఇప్పుడు ఆడియన్స్ సినిమాను ఆదరించే తీరు మారిందని, కాబట్టి పూరీ తన రైటింగ్ కు పదును పెట్టి సరికొత్త కథలతో ఆడియన్స్ ను మెప్పించాలని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. ఒక మంచి హిట్ పడితే మళ్లీ పూరీ వరుస సినిమాలతో అలరిస్తాడని పూరీ ఫ్యాన్స్ భావిస్తున్నారు.













