పూరీపై రాజమౌళి తండ్రి అభిమానం
రాజమౌళి తండ్రి, రైటర్ విజయేంద్ర ప్రసాద్ కు రాజమౌళి కాకుండా ఫేవరెట్ డైరెక్టర్ పూరీ జగన్నాధ్ అనే విషయం అందరికీ తెలిసిందే. తన మొబైల్ వాల్‌పేపర్ కూడా పూరీ ఫోటోనే ఉంటుందని కొన్నేళ్ల కిందట ఓ ఇంటర్వ్యూలో పెద్దాయన చెప్పాడు. అంతేకాదు విజయేంద్ర ప్రసాద్‌కు పూరీ మీద అభిమానం ఏ రేంజ్ లో ఉందో రీసెంట్ గా పూరీ బయట పెట్టాడు.
లైగర్ డిజాస్టర్ తర్వాత పూరీకి విజయేంద్ర ప్రసాద్ ఫోన్ చేసి, నీ లాంటి డైరెక్టర్లు ఫెయిలవడం నాకు బాధ కలిగిస్తుందని, తర్వాత సినిమా చేయబోయే ముందు కథ ఒక్కసారి నాకు వినిపించమని ఆయన అడిగారని పూరీ చెప్పాడు. కథలో ఏమైనా లోపాలుంటే రైటర్ గా సూచనలిద్దామనేది పెద్దాయన ఉద్దేశం. పాన్ ఇండియా డైరెక్టర్ ని ఇంట్లోనే పెట్టుకుని కూడా తన మీద ఇంత ప్రేమ చూపించిన విజయేంద్ర గారి సలహాకు పూరీ కదిలిపోయినట్లు తెలిపాడు.
అందుకే డబుల్ ఇస్మార్ట్ సినిమాకు ఒళ్లు దగ్గరపెట్టుకుని మరీ కథ రాసుకున్నానని, ఆ సినిమాతో తనేంటో ప్రూవ్ చేసుకోవాలని డిసైడ్ అయ్యి, ఆయనకు కథ చెప్పకుండానే సినిమాను ఎంతో జాగ్రత్తగా ఫినిష్ చేసినట్లు పూరీ చెప్పాడు. ఒకప్పుడు ఇడియట్, పోకిరి లాంటి బ్లాక్ బస్టర్లు తీసిన పూరీ లైగర్ లాంటి సినిమా చేసి డిజాస్టర్ అందుకుంటే ఎవరికైనా బాధ కలగడం సహజమే. అయితే డబుల్ ఇస్మార్ట్ విషయంలో పూరీ కాన్ఫిడెన్స్ చూస్తుంటే బ్లాక్ బస్టర్ అనే నమ్మకం స్ట్రాంగ్ గా కనిపిస్తోంది. హీరో రామ్ కూడా ఈ సినిమా విజయం ఎంతో కీలకం.













