Puri Jagannadh: పూరీ ప్లాన్ వర్కవుట్ అవుతుందా?
లైగర్(Liger), డబుల్ ఇస్మార్ట్(Double ismart) సినిమాలతో భారీ డిజాస్టర్లు అందుకున్న పూరీ జగన్నాథ్(Puri Jagannath)ఆ రెండు సినిమాలతో డైరెక్టర్ గానే కాకుండా నిర్మాతగా కూడా ఎంతో నష్టపోయాడు. సాధారణంగా ఫ్లాపుల్లో ఉన్న సీనియర్ డైరెక్టర్లకు ఏ హీరో అంత త్వరగా నమ్మి ఛాన్స్ ఇవ్వరు. కానీ పూరీ మాత్రం ఏకంగా విజయ్ సేతుపతి(Vijay Sethupathi)కి కథ చెప్పి ఆయనతో గ్రీన్ సిగ్నల్ ఇప్పించుకుని సినిమాను అనౌన్స్ చేశాడు.
అక్కడితో అయిపోలేదు. ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం సీనియర్ నటి టబు(Tabu)ని ఎంపిక చేశారు. హీరోయిన్ గా రాధికే ఆప్టే(Radhika Apte) గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందంటున్నారు. వీటన్నింటినీ బట్టి చూస్తుంటే పూరీ ఈసారి సంథింగ్ స్పెషల్ గా ట్రై చేస్తున్నాడనిపిస్తోంది. సేతుపతి రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పూరీ చెప్పిన కథ తనకు చాలా బాగా నచ్చిందని చెప్పిన సంగతి తెలిసిందే.
అయితే కథ, స్క్రిప్ట్ విషయంలో పూరీ రూట్ మార్చినప్పటికీ వేగం విషయంలో మాత్రం పాత ఫార్ములానే ఫాలో అవుతున్నట్టు తెలుస్తోంది. వీలైనంత త్వరగా షూటింగ్ ను పూర్తి చేసేలా పూరీ షెడ్యూల్స్ ను ప్లాన్ చేసుకుంటున్నాడట. ఈ నేపథ్యంలోనే మ్యూజిక్ డైరెక్టర్ గా ఎవరిని తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నాడట పూరీ. ఈసారి కొత్తగా సంతోష్ నారాయణన్(Santhosh Narayanan), జీవీ ప్రకాష్(Jeevi Prakash)తో సినిమా చేయాలని చూస్తున్నాడట. ఈ సినిమాకు బెగ్గర్(Beggar) అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది.













