ఎక్సట్రాలొద్దు విజయ్!
అర్జున్ రెడ్డి సినిమా తర్వాత టాలీవుడ్ లో కానీ బాలీవుడ్ లో పాపులర్ హీరోగా పేరు తెచ్చుకున్న హీరో విజయ్ దేవరకొండ. గీత గోవిందం చిత్రం నుండి తక్కువ సమయంలో ఎక్కువ క్రేజ్ సంపాదించున్న విజయ్ తో సినిమాలు చేయడానికి స్టార్ దర్శక నిర్మాతలు కూడా ఎదురు చూసే పరిస్థితి నేడు. బాలీవుడ్ లో కరణ్ జోహార్ లాంటి వ్యక్తి కూడా విజయ్ దేవరకొండ తో సినిమా చేసేందుకు గాను గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఇప్పుడు పూరి జగన్నాథ్ విజయ్ దేవరకొండ హీరోగా కరణ్ జోహార్ నిర్మాతగా ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే.
ఫైటర్ అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా వస్తోంది. దాదాపు సగానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈ ఏడాది చివర్లో గానీ వచ్చే ఏడాది మొదట్లో గానీ విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఇదిలా ఉంటే ఇప్పుడు విజయ్ దేవరకొండ విషయంలో పూరి జగన్నాథ్ తీవ్ర ఆగ్రహంగా ఉన్నాడని సమాచారం. కథలో చాలా వరకు మార్పులు చేయాలి అంటూ పూరి జగన్నాథ్ ని విజయ్ దేవరకొండ తీవ్రంగా ఒత్తిడి చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. లాక్ డౌన్ సమయంలో కథను మార్చాలి అంటూ పూరి జగన్నాథ్ పై తీవ్రంగా విజయ్ దేవరకొండ ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం.
దీనిపై ఇప్పుడు పూరి తీవ్ర ఆగ్రహంగా ఉన్నాడట. తనకు కథ ఎలా ఉందో ఎలా ఉండాలో స్పష్టమైన అవగాహన ఉందని నాకు కొత్తగా ఏమీ నేర్పవద్దనీ స్పష్టంగా చెప్పేశాడట. తనను ఎక్కువగా యూత్ అట్ట్రాక్ అవుతారని సినిమాలో రొమాంటిక్ సీన్లు ఎక్కువగా వుండాలని, విజయ్ దేవరకొండ నుంచి పై ఒత్తిడి వస్తుందట. విజయ్ కాస్త ఘాటుగా రొమాంటిక్ సీన్లు విషయంలో అవి ఖచ్చితంగా ఆ సీన్లు ఉండాలి, ఈ సీన్లు ఉండాలి అని కెలకడంతో పూరి అవసరం అయితే తాను సినిమా నుంచి తప్పుకుంటానని తన కథ విషయంలో ఎవరు వెలు పెట్టడానికి వీలు లేదని నాకు అనవసమైన ఎలాంటి సలహాలు ఇవ్వద్దు అని మొహ మాటం లేకుండా పూరి చెప్పేశాడట..













