ఆ రెండు టైటిల్సూ కాదంటున్న పూరి
డిఫరెంట్ కాన్సెప్ట్స్‌తో సినిమాలు తీసి ప్రేక్షకుల్ని మెప్పించడంలో పూరి జగన్నాథ్ తనకు తానే సాటి. తాజాగా పూరి డైరెక్షన్లో విజయ్ దేవరకొండ హీరోగా ఓ పాన్ ఇండియా చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని పూరి కనెక్ట్స్, ధర్మా ప్రొడక్షన్స్ పతాకాలపై భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. 40 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకి మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్నారు. లాక్డౌన్ కారణంగా షూటింగ్ నిలిచిపోయింది.
ఇక ఈ సినిమా టైటిల్ విషయంలో ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఇప్పటివరకు టైటిల్ విషయంలో పూరి జగన్నాథ్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. ఈమధ్యకాలంలో ఈ సినిమా కోసం బయట వినిపించిన టైటిల్ ఫైటర్. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ ఫైటర్‌గా నటిస్తున్నాడు కాబట్టి టైటిల్ కూడా ఫైటర్ అనే పెట్టారని ప్రచారం జరిగింది. మరోపక్క ఈ సినిమా కోసం లైగర్ అనే టైటిల్‌ను అనుకుంటున్నారని చెప్పకున్నారు. లయన్‌కి, టైగర్‌కి పుట్టిన సంతానాన్ని లైగర్ అంటారు. ఈ సినిమాకి ఇదే టైటిల్ ఫిక్స్ అని అందరూ ఫిక్స్ అయ్యారు. అయితే ఫైటర్ అనేది వర్కింగ్ టైటిల్ మాత్రమేనని, టైటిల్ త్వరలోనే ప్రకటిస్తామని ఇటీవల ఓ ఇంటర్యూలో పూరి జగన్నాథ్ క్లారిటీ ఇచ్చారు. డిఫరెంట్ కాన్సెప్ట్స్‌తో సినిమాలు తియ్యడమే కాదు, తన సినిమాలకు టైటిల్స్ పెట్టడంలోనూ పూరి అందరి కంటే ఒక అడుగు ముందుంటాడు. మరి ఈ సినిమాకి ఎలాంటి టైటిల్ ఎనౌన్స్ చెయ్యబోతున్నాడో తెలుసుకోవాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే.













