పూరీ కూడా బ్రేక్ ఇచ్చాడు
పూరి జగన్నాధ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ కథానాయకుడిగా చేస్తున్న చిత్రానికి కరోనా వైరస్ సోకింది. ఏకధాటిగా సాగుతున్న తమ షెడ్యూల్‌కు టెంపరరీ బ్రేక్ ఇస్తున్నట్లు సోషల్ మీడియా ద్వారా పూరీ తెలియజేశారు. పూరి, నటి చార్మి సంయుక్తంగా పూరి కనెక్టస్ పేరుతో రూపొందించిన నిర్మాణ సంస్థపై చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇపుడు ఈ చిత్రానికి బ్రేక్ ఇస్తున్నట్లు వాళ్లు ప్రకటించారు. అలాగే కరోనా వైరస్ బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలను కోరారు. ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ ఫైటర్‌గా కనిపిస్తుండగా, అనన్య పాండే హీరోయిన్గా నటిస్తుంది. హిందీ, తెలుగు, తమిళ భాషలలో ఈ చిత్రం విడుదల కానుంది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన రెండు షెడ్యూల్స్ పూర్తి చేసినట్లు తెలుస్తోంది.













