పవన్ అభిమానులకు గుడ్ న్యూస్.. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా
పవన్ కల్యాణ్, రానా కాంబినేషన్లో ఓ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. త్రివిక్రమ్ రచనా సహకారం అందిస్తున్న ఈ చిత్రానికి సాగర్ కె.చంద్ర దర్శకుడు. ఈ చిత్రానికి సంబంధించి ఓ అప్డేట్ని చిత్రబృందం అభిమానులతో షేర్ చేసుకుంది. ఈ నెల 15న ఉదయం 9:45 గంటలకు ఈ చిత్ర టైటిల్, పవన్ కల్యాణ్ పాత్రకి సంబంధించి గ్లింప్స్ ను విడుదల చేస్తున్నట్టు ప్రకటిస్తూ పవర్ స్ట్రోమ్ పేరుతో ఓ పోస్టర్ని కూడా మేకర్స్ రిలీజ్ చేశారు. ఇందులో లుంగీ కట్టులో వెనక్కి తిరిగి ఉన్న పవన్ కల్యాణ్ ప్రీ లుక్ అందరినీ ఆలరిస్తోంది. మలయాల సూపర్ హిట్ చిత్రం అయ్యప్పనుమ్ కోషియమ్ చిత్రానికి రీమేక్‌గా ఈ సినిమా రూపొందుతోంది. భీమ్లా నాయక్‌గా పవన్‌కల్యాణ్ నటిస్తున్న ఈ సినిమాలో ఆయన సరసన నిత్యామీనన్ నటిస్తుండగా, రానాకి జోడిగా ఐశ్యర్య రాజేష్ మెరవబోతోంది. తమన్ సంగీతం సమకూరుస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగ వంశీ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.













