టిల్లు-3 మ్యాటరేంటి?
టాలీవుడ్ లో ఈ సమ్మర్ టిల్లూ స్వ్కేర్ తో స్టార్ట్ అయింది. ఎన్నో అంచనాల మధ్య రిలీజైన ఈ సినిమా ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేయడంలో సక్సెస్ అవుతుంది. టిల్లూ పాత్ర మరోసారి పండటం, సిద్దూ పెర్ఫార్మెన్స్ అదిరిపోవడం, డైలాగ్స్ బాగా పేలడం వల్ల టిల్లూ స్వ్కేర్ సందడి థియేటర్లలో బాగా కనిపిస్తుంది.
కథ కొంచెం వీక్ అయినా, లాజిక్స్ లేకపోయినా, ఎంటర్టైన్మెంట్స్ కు ఢోకా లేకపోవడం టిల్లూ స్వ్కేర్ కు బాగా ప్లస్ అయింది. అయితే ఈ సినిమా క్లైమాక్స్ లో ఆడియన్స్ కోరుకున్న మెరుపు లేకపోవడం మాత్రం కొంత నిరాశను మిగిల్చింది. టాలీవుడ్ లో ఇంతగా క్లిక్ అయిన టిల్లూ క్యారెక్టర్ ను ఇక్కడితో ఆపేయడమేంటని అందరూ నిరాశ చెందారు.
సడెన్ గా టిల్లూ స్క్వేర్ ను ఎండ్ చేయడంతో టిల్లు-3 ఉండదనుకున్నారంతా. కానీ టిల్లూ స్వ్కేర్ సక్సెస్ సెలబ్రేషన్స్ లో నిర్మాత నాగవంశీ అసలు విషయాన్ని చెప్పాడు. టిల్లు-3 ఉంటుందని, దాని గురించి హింట్ సినిమాలో పెట్టడం కుదరలేదని, వీకెండ్ అయ్యాక సినిమాలో ఆ బిట్ ను యాడ్ చేస్తామని, సోమవారం నుంచి మూడో పార్ట్ గురించి కొసమెరుపు ఉంటుందని చెప్పాడు. దీంతో టిల్లూ ఫ్యాన్స్ చాలా జోష్ లో ఉన్నారు.













