ఎవడన్నాడు ఆగిందని…‘ప్రాజెక్ట్ K’ పక్కా ప్లానింగ్ తో షూటింగ్ జరుగుతోంది! : నిర్మాత అశ్వినీ దత్
తాజాగా ‘ప్రాజెక్ట్ K’ సినిమా షూటింగ్ ఆగిందని, అందుకు కారణం అందులో కథానాయికగా నటిస్తోన్న బాలీవుడ్ భామ దీపికా పదుకొనె అంటూ నెట్టింట వార్తలు వినిపించాయి. ఈ న్యూస్ రావడానికి కారణం.. షూటింగ్ సమయంలో దీపికా పదుకొనె కు కాస్త ఇబ్బందిగా అనిపించటంతో ఆమె వెంటనే కామినేని హాస్పిటల్‌కు వెళ్లి చెకప్ చేయించుకుంది. దీంతో ‘ప్రాజెక్ట్ K’ మూవీ షూటింగ్ ఆగిందనే రూమర్స్ బయటకు వచ్చాయి. అయితే ఈ వార్తలపై నిర్మాత అశ్వినీ దత్ స్పందించారు.‘‘ప్రాజెక్ట్ K’ షూటింగ్ ఆగిందంటూ వినిపిస్తోన్న వార్తల్లో నిజం లేదని ఎవడన్నాడు ఆగిందని… అనుకున్న ప్లానింగ్ ప్రకారం షూటింగ్ జరుగుతుంది’’ అన్నారు. జూన్ 20 వరకు ప్రస్తుతం జరగుతున్న షెడ్యూల్ చిత్రీకరణ ఉంటుందట. ఇందులో అమితాబ్ బచ్చన్ , దీపికా పదుకొనెపై సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. తర్వాత కంటిన్యూగా జరిగే చిత్రీకరణలో ప్రభాస్ పాల్గొనబోతున్నారు. ఈ కంటిన్యూటీ 10 రోజుల పాటు జరగనుందని సమాచారం. ప్రాజెక్ట్ కె చిత్రంతో పాటు మరో వైపు ప్రభాస్ సలార్ సినిమా షూటింగ్‌ను కూడా సమాంతరంగా పూర్తి చేసుకుంటూ వస్తున్నారు. ఈ రెండు సినిమాలపై భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి.













