ప్రియాంకకు వరుస ఆఫర్లు
గ్యాంగ్ లీడర్ సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైన ప్రియాంక అరుళ్ మోహన్ మొదటి సినిమాతో ఫ్లాపు ను అందుకుంది. ఆ తర్వాత శర్వానంద్ తో శ్రీకారం సినిమా చేసినప్పటికీ అది కూడా అలాంటి ఫలితాన్నే ఇవ్వడంతో తెలుగులో అవకాశాలు రాలేదు. అందానికి అందం, టాలెంట్‌కు టాలెంట్ ఉన్నప్పటికీ అమ్మడు కోలీవుడ్ కే పరిమితమైంది.
కోలీవుడ్‌లో ఆమె చేసిన ఈటీ, డాక్టర్, డాన్ సినిమాలు హిట్స్ అవడంతో మళ్లీ అవకాశాలు పుంజుకున్నాయి. ధనుష్ కెప్టెన్ మిల్లర్‌లో హీరోయిన్గా నటిస్తున్న ప్రియాంకకు తెలుగులో ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన ఓజీలో నటించే అవకాశమందుకుంది. ఈ సినిమాపై అందరికీ భారీ అంచనాలున్నాయి.
ఇది కాకుండా డీవీవీ బ్యానర్లోనే నాని, వివేక్ ఆత్రేయ కాంబోలో వస్తున్న సరిపోదా శనివారం సినిమాలో కూడా ప్రియాంక ఛాన్స్ అందుకుంది. ఈ రెండింటితో పాటూ అమ్మడుకు మరో క్రేజీ ఆఫర్ కూడా వచ్చినట్లు తెలుస్తోంది. అదే రవితేజ- గోపీచంద్ మలినేని సినిమా. ముందుగా ఈ సినిమా కోసం రష్మిక, కృతి శెట్టిలను అనుకున్నప్పటికీ వారిద్దరూ ఖాళీగా లేకపోవడంతో ఇప్పుడు ఫైనల్ ఆప్షన్ గా ఆ ఛాన్స్ ప్రియాంకను వరించిందని తెలుస్తోంది. ఇదే నిజమైతే అమ్మడి చేతిలో మూడు తెలుగు సినిమాలున్నట్లు లెక్క. వీటిలో ఏ రెండు సినిమాలు మంచి ఫలితాలనిచ్చినా ప్రియాంక కెరీర్ గ్రాఫ్ మారిపోవడం ఖాయం.













