ప్రియాంక క్రేజ్ మామూలుగా లేదుగా!
టాలీవుడ్ లో హీరోయిన్ల కొరత ఎక్కువగా ఉందని చెప్పాలి. ఫామ్ లో ఉన్న స్టార్ హీరోయిన్లు బాలీవుడ్ వైపు, ఉన్న శ్రీలీల వరుస సినిమాలతో ఖాళీ లేకపోవడం, మీనాక్షి చౌదరి బిజీ అవుతున్న టైమ్ లో ప్రియాంక అరుళ్ మోహన్ నిర్మాతలకు బెస్ట్ ఛాయిస్ గా మారింది. ప్రియాంక మొదటి నుంచి పక్కింటి అమ్మాయి క్యారెక్టర్లు ఎక్కువగా చేస్తూ వచ్చింది.
ప్రస్తుతం ప్రియాంక టైమ్ చాలా బాగుంది. ఓజీలో పవన్ సరసన ఛాన్స్ కొట్టేసిన దగ్గర నుంచి అమ్మడుకు ఆఫర్ల మీద ఆఫర్లు వస్తున్నాయి. ఛాన్స్ వచ్చింది కదా అని అన్ని సినిమాలు చేయకుండా కంటెంట్ ఉన్న సినిమాలనే చేసే ప్రయత్నం చేస్తోంది ప్రియాంక. ఇప్పటికే నానితో ఓ సారి గ్యాంగ్ లీడర్ సినిమా కోసం జత కట్టిన ప్రియాంక ఇప్పుడు మరోసారి సరిపోదా శనివారం కోసం జోడీ కట్టనుంది.
ఇది కాకుండా రవితేజ- గోపీచంద్ మలినేని కాంబోలో వస్తున్న సినిమా కోసం కూడా ప్రియాంకను ఫిక్స్ చేసినట్లు సమాచారం. వీటితో పాటూ మరో రెండు పెద్ద బ్యానర్లలో కూడా ప్రియాంకకు ఆఫర్లు వచ్చే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. చేతిలో ఉన్న సినిమాల్లో ఒక్కటి క్లిక్ అయినా సరే అమ్మడి రేంజ్ అమాంతం పెరగడం ఖాయం.













