సంచలన నిర్ణయం తీసుకున్న ప్రియాంక చోప్రా
గ్లోబల్ భామ ప్రియాంక చోప్రా తన బర్త్ డే రోజు సొంత నిర్మాణ సంస్థ పర్పుల్ పెబ్బెల్ ప్రొడక్షన్స్ లో పనిచేస్తున్న ఉద్యోగినులకు బంపర్ ఆఫర్ ఇచ్చింది. తన కంపెనీలో పని చేసే మహిళా ఉద్యోగినులలో ఎక్కువ మంది వివాహితులే ఉండడంతో వారికి అనుకూలంగా ఉండేలా కొన్ని మార్పులు చేసింది. మహిళల ఆలోచనలు, అభిప్రాయాలకి విలువనివ్వాలని కాబట్టి వారి పనివేళలలో మార్పులు చేశాం. 12 వారాల పాటు ప్రసూతి సెలవులు ఇచ్చి, ఆ దినాలలో నగదు సాయం చేస్తాం అని ప్రియాంక తల్లి, మేనేజర్ మధు చోప్రా తెలిపారు. మగవారి పట్ల కూడా మేం సానుకూలంగానే ఉన్నాం. ఇటీవల మా కంపెనీలో పని చేస్తున్న మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ కి పెటర్నిటీ లీవు కింద నాలుగు వారాల పాటు సెలవు ఇచ్చాం. ఈ నిర్ణయం పూర్తిగా ప్రియాంకదే అని తెలిపారు మధు చోప్రా.













