అలాంటి సీన్లు ప్రియాంక చేయదట
బాలీవుడ్ స్టార్ బ్యూటీ ప్రియాంక చోప్రా, అమెరికన్ సింగర్ నికో జోనస్ పెళ్లి చేసుకొని ఓ ఇంటి వారయ్యారు. ప్రస్తుతం దాంపత్య జీవితాన్ని వీరు ఆనందంగా గడుపుతున్నారు. అయితే ఇకముందు అడల్ట్ ఓన్లీ సినిమాలు కానీ, షోలు కానీ, టివి సీరిస్‌లు కానీ ప్రియాంక, నిక్‌లు చేయరట. వీరిద్దరూ కలిసి ఈ నిర్ణయాన్ని తీసుకున్నారట. అలా ఎందుకంటే తమ భవిష్యత్తును, కుటుంబాన్ని, రేపటి తరం తమ పిల్లల కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు వారు చెప్పారు. ఇది వరకు ప్రియాంక, నిక్‌లు కొన్ని హాట్ సినిమాల్లో, మ్యూజిక్ వీడియోల్లో, టివీ సీరిస్‌లలో నటించారు. గతంలో కొన్ని బాలీవుడ్ సినిమాల్లో ప్రియాంక హాట్‌గా నటించింది. అయితే ఇకపై మాత్రం అలాంటి సీన్లు చేయదట. కొందమంది బాలీవుడ్ హీరోయిన్లు పెళ్లి తర్వాత కూడా హాట్ సీన్లలో నటించేందుకు అభ్యంతరం లేదని అంటుంటే ప్రియాంక మాత్రం అటువంటి సీన్లు చేయనని చెప్పడం విశేషం.













