ఘనంగా ప్రియాంక-నిక్ వెడ్డింగ్ రిసెప్షన్
మూడు ముళ్ళ బంధంతో ఒక్కటైన ప్రియాంక చోప్రా, నిక్ జోనాస్ (ముద్దుగా నిక్యాంక) లు ఢిల్లీలో ఓ రిసెప్షన్ జరుపుకున్న సంగతి తెలిసిందే. సబ్యసాచి డిజైన్ చేసిన బ్లూ కలర్ కస్టమ్ మేడ్ డ్రెస్‌లో ప్రియాంక మెరువగా, లైట్ గ్రే కలర్ సూట్లో నిక్ జోనాస్ దర్శనమిచ్చాడు. రిస్పెషన్కి వచ్చిన అతిధులు నూతన జంటకి ఆశీర్వాదం అందించారు. ఈ కార్యక్రమంలో ఇతనే నా భర్త అని ప్రియాంక అందరికి పరిచయం చేయడం గమనార్హం. ఇక నిక్ భారత్‌లో నా మొదటి షో ఇదే అంటూ చమత్కరించారు. వేడుకు వచ్చిన అతిథులకు, మీడియా ప్రతినిధులకు నిక్ కృతజ్ఞతలు తెలిపారు. వేడుకకు బాలీవుడ్‌కు చెందిన ప్రముఖులంతా హాజరైనట్లు తెలుస్తోంది. పెళ్లి తర్వాత హనీమూన్ కోసం అరేబియన్ దేశాలకి వెళ్ళిన నిక్యాంక జంట ఇటీవల ఇండియాకి వచ్చినట్టు తెలస్తుంది. ప్రియాంక, నిక్‌ల వివాహం జోథ్‌పూర్‌లోని ఉమైద్ ప్యాలెస్ వేదికగా జరిగిన సంగతి తెలిసిందే. డిసెంబర్ 2న క్రైస్తవ పద్ధతిలో, 3న హిందూ సంప్రదాయం ప్రకారం వీరిరివురి వివాహం జరిగింది.













