ఏప్రిల్ పూల్స్ చేయడం కోసం ప్రియాంక పెళ్లితో పరాచికాలు
జనాలను ఏప్రిల్ పూల్స్ చేయడం కోసం ఓ ఫారిన్ మ్యాగజైన్ ప్రియాంక చోప్రా విడాకులు తీసుకుంటోందంటూ ఓ ప్రత్యేక వార్తను ప్రచురించండం వివాదాస్పదమవుతోంది. సరదా కోసమే అయినా ఓ మహిళ జీవితంతో ఇలా ఆడుకోవడం అన్యాయంటూ అందరూ విరుచుకుపడుతున్నారు. దీనిపై ప్రియాంక ఇంకా స్పందించలేదు. ఇంటర్నేషనల్ పాప్ సింగర్ నిక్ జోనాస్‌తో ప్రియాంక పెళ్లి జరగడం తెలిసిందే. పెళ్లి తర్వాత ప్రియాంక ఏ సినిమాకూ ఇంకా ఒప్పుకోలేదు. నిక్‌తో కలిసి దేశాలన్నీ తిరుగుతూ ఎంజాయ్ చేస్తోంది. ఈ నేపథ్యంలో ఆమె పెళ్లి పెటాకులు కానుందంటూ ఏప్రిల్ పూల్ చేయడం చర్చనీయాంశమవుతోంది.













