ప్రియాంక చోప్రా విడాకులు ?
బాలీవుడ్ అందాల నటి ప్రియాంక చోప్రా విడాకులు తీసుకోబోతున్నట్టు అమెరికాకు చెందిన ఓ మ్యాగజైన్ సంచలన వార్తను ప్రచురించింది. గత కొన్నేళ్లుగా నిక్ జోనస్ అనే సింగర్‌తో డేటింగ్ చేస్తూ వచ్చిన ప్రియాంక గతేడాది డిసెంబరులో జోద్‌పూర్‌లోని ఉమైద్ ప్యాలెస్‌లో ఘనంగా వివాహం చేసుకుంది. హిందూ, క్రైస్తవ సంప్రదాయాలలో ప్రియాంక, నిక్ జోనస్ పెళ్లి జరగగా.. ఈ పెళ్లికి అతిరథమహారథులు తరలివచ్చారు. అయితే పెళ్లైన మూడు నెలలకే వారి మధ్య మనస్పర్థలు వచ్చినట్టు మ్యాగజైన్ చెబుతోంది. మ్యాగజైన్ చెప్పిన కథనం ప్రకారం.. ప్రియాంకలో పెళ్లి తర్వాత చాలా మార్పు వచ్చినట్టు, భర్తతో కోప్పడుతున్నట్టు తెలిసింది. అంతేకాకుండా పెళ్లి తరువాత పిల్లల్ని కని గృహిణిలా ఉంటుందనుకుంటే అలా కాకుండా 20 ఏళ్ల అమ్మాయిలా ప్రవర్తిస్తునట్టు నిక్ తల్లిదండ్రులు గుర్తించినట్టు మ్యాగజైన్ చెప్పింది. దీంతో నిక్ కుటుంబసభ్యులు ఆమెతో తెగదెంపులు చేసుకోమని సలహా ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రియాంక నుంచి ఇప్పటి వరకు ఎలాంటి వార్త రాకపోవడంతో ఈ వార్తలో ఎంత నిజం ఉందో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.













