ఇప్పుడైనా ప్రియాంక బిజీ లిస్ట్ లోకి చేరేనా?
గ్యాంగ్ లీడర్ సినిమాతో అందర్నీ ఆకట్టుకున్న ప్రియాంక అరుల్ మోహన్.. ఆ సినిమా తర్వాత వరుస సినిమాలు చేస్తుందనుకున్నారంతా. కానీ తన రెండవ సినిమాకు ప్రియాంక కాస్త ఎక్కువ గ్యాపే తీసుకుంది. గ్యాంగ్ లీడర్ తర్వాత చిన్న చిన్న ఆఫర్లొచ్చినా ప్రియాంక వాటిని పట్టించుకోలేదు. తర్వాత చాన్నాళ్లకు మంచి క్యారెక్టర్ ప్లస్ కో స్టార్ దొరకడంతో శ్రీకారం సినిమా చేసేందుకు ఒప్పుకుంది. ప్రస్తుతం ఒకటి, రెండు సినిమాలతోనే టాలీవుడ్ లో బిజీ హీరోయిన్స్ లిస్ట్ లోకి వెళ్లిపోతున్న తరుణంలో ఇప్పుడైనా బిజీ హీరోయిన్ గా మారనుందా అనేది ఇప్పుడు చర్చగా మారింది.
తమిళంలో తను చేసిన డాక్టర్ మూవీ కూడా రిలీజ్ కు రెడీ గా ఉంది. దీంతో శ్రీకారం, డాక్టర్ సినిమాలతో ప్రియాంక ఇక్కడ, అక్కడ బిజీ అయ్యే ఛాన్సుందనంటున్నారు. శ్రీకారం రిలీజ్ అయ్యే వరకు కొత్త సినిమాలకు ఓకే చెప్పకూడదనే రీజన్ తోనే ఈమె ఇంకా ఏ సినిమాకీ సైన్ చేయలేదని తెలుస్తుంది. శ్రీకారం రిలీజ్ అయి సక్సెస్ దక్కించుకుంటే టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా ప్రియాంక మారే అవకాశముంది. మొదటి రెండు సినిమాల్లో కూడా ఈమె గ్లామర్ షో చేయలేదు. మరి ముందు ముందైనా ప్రియాంక అలా కనిపించేందుకు ఒప్పుకుంటుందో లేదో చూడాలి.













