Priyanka Arul Mohan: పవన్ ఫ్యాన్స్ ను డిజప్పాయింట్ చేసిన ప్రియాంక

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(pawan kalyan) హీరోగా నటించిన ఓజి(OG) సినిమాపై మొదటి నుంచి ఎన్ని అంచనాలున్నాయో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూస్తామా అని ఫ్యాన్ వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. రోజురోజుకీ ఓజి సినిమాపై అంచనాలు తారా స్థాయికి చేరుకుంటున్నాయి. ఫ్యాన్ బాయ్ సుజిత్(Sujeeth) దర్శకత్వంలో తెరకెక్కిన ఓజి సెప్టెంబర్ 25న రిలీజ్ కానుంది.
రిలీజ్ కు మరో 9 రోజులే ఉండటంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ ను భారీగా ప్లాన్ చేసింది. అందులో భాగంగానే సినిమాలో పవన్(pawan) సరసన హీరోయిన్ గా నటించిన ప్రియాంక అరుళ్ మోహన్(priyanka Arul Mohan) మీడియా ముందుకొచ్చి ఓజి(OG) ని ప్రమోట్ చేసే పనిలో పడింది. ఓజి ప్రమోషన్స్ లో పాల్గొన్న ప్రియాంక సినిమాపై తన ఎగ్జైట్మెంట్ తో పాటూ పలు విషయాలను చెప్తున్నారు.
అందులో భాగంగానే ప్రియాంక పవన్ ఫ్యాన్స్ కు ఓ బ్యాడ్ న్యూస్ ను చెప్పారు. ఓజి సినిమాకు ముందు రోజు ఎలాంటి ప్రీమియర్లు ఉండవని చెప్పి ఫ్యాన్స్ ను డిజప్పాయింట్ చేశారు ప్రియాంక. రీసెంట్ గా టాలీవుడ్ లో సినిమా రిలీజ్ కు ఓ రోజు ముందుగానే ప్రీమియర్స్ వేస్తూ వస్తుండగా ఓజికి కూడా అలా వేస్తే బావుంటుందని ఫ్యాన్స్ ఆశ పడ్డారు. కానీ ఓజికి అలాంటి ప్రీమియర్స్ ఏమీ లేవని ఇప్పుడు క్లారిటీ వచ్చింది. కాకపోతే ఈ మూవీకి అర్థరాత్రి 1 గంట షో లు, 4 గంటల షో లు వేయడానికి మాత్రం ప్లాన్స్ చేస్తున్నట్టు తెలుస్తోంది.