కథ డిమాండ్ చేస్తే ఎక్స్పోజింగ్ తరహా గ్లామర్ పాత్రలు చేసేందుకు నేను రెడీ : ప్రియమణి
దశాబ్డం క్రితం టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో కథనాయికల్లో ప్రియమణి కూడా ఒకరు.. కొన్ని సంవత్సరాల క్రితం అటు తెలుగు, ఇటు తమిళ, కన్నడ భాషల్లో నటిస్తూ మంచి హీరోయిన్గా గుర్తింపు దక్కించుకుంది. పెళ్ళికి ముందు స్టార్ హీరోలతో నటించి ఏకంగా అగ్ర హీరోయిన్ రేంజ్‌కి వెళ్లిన ప్రియమణి..తన వివాహం తర్వాత దూకుడు తగ్గించేసింది…అయితే ఇపుడు సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. ‘కణ్గళాల్ ఖైదుసెయ్’ అనే చిత్రం ద్వారా కోలీవుడ్లోకి అడుగుపెట్టిన ప్రియమణి.. ప్రస్తుతం దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవిత చరిత్ర ఆధారంగా బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ప్రధానపాత్రలో తెరకెక్కుతున్న ‘తలైవి’ చిత్రంలో ఓ కీలక పాత్ర పోషిస్తోంది.
ఈ క్రమంలో కోలీవుడ్‌లోనూ రెండో ఇన్సింగ్స్ ప్రారంభించేందుకు సిద్ధమైన ప్రియమణి…మరింత స్లిమ్‌గా కనిపించేందుకు కూడా తన శరీరాకృతిని కూడా మార్చుకుంది. ఈ విషయంపై ప్రియమణి స్పందిస్తూ, కథ డిమాండ్ చేస్తే ఎక్స్పోజింగ్ తరహా గ్లామర్ పాత్రలు చేసేందుకు సిద్ధమేనని ప్రకటించింది. ఇందుకోసం ఓ గ్లామర్ ఫొటో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఇది వైరల్ అయింది. కాగా, ప్రస్తుతం ప్రియమణి చేతిలో దక్షిణాది భాషలతో పాటు, హిందీ కలుపుకుని దాదాపు అర డజనుకు పైగా సినిమాలు ఉన్నాయి.. ఇక తెలుగులో కూడా తన సెకండ్ ఇన్నింగ్స్ ని కొనసాగిస్తోంది ప్రియమణి..
ప్రస్తుతం తెలుగులో సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ సరసన నారప్ప సినిమాలో కథానాయికగా నటిస్తోంది.. ఇక ఈ సినిమాతో పాటూ రానా దగ్గుబాటి హీరోగా వేణు ఊడుగుల దర్శకత్వంలో తెరకెక్కుతున్న విరాట పర్వం సినిమాలో ఓ ముఖ్య పాత్రలో నటిస్తుంది ప్రియమణి.. నక్సల్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రియమణి నక్సలైట్ గా కనిపించనుంది.. దానికి సంబంధించి ఇటీవలే కొన్ని పోస్టర్లు, టీజర్ లను విడుదల చేసింది చిత్ర యూనిట్..ఇక ఇటు వరుస సినిమాలతో పాటు బుల్లితెరపై ప్రసారమయ్యే ఢీ అనే డాన్స్ షోకి జడ్జి గా కూడా వ్యవహరిస్తోంది.













