విరాటపర్వంలో ప్రియమణి ?
పెళ్లయిన కొత్తలో యమదొంగలాంటి చిత్రాలతో టాలీవుడ్‌కు కొత్త రుచులు చూపించిన ప్రియమణి కొత్త హీరోయిన్ల పోటీకి తట్టుకోలేక క్రమంగా సినిమాలు తగ్గించేయడం తెలిసిందే. కొద్దిగ్యాప్ తరువాత సిరివెన్నెల చిత్రంలో రీఎంట్రీ ఇస్తున్న ప్రియమణి.. తాజాగా మరో ప్రాజెక్టుకూ సైన్ చేసిందట. రానా దగ్గుబాటితో దర్శకుడు వేణు ఊడుగుల తెరకెక్కించనున్న విరాటపర్వం 1992 చిత్రంలో ఓ ముఖ్య పాత్ర చేయడానికి ప్రియమణి ఓకే చెప్పినట్టు టాక్. సాయిపల్లవి హీరోయిన్గా నటిస్తుంటే, కీలకమైన పాత్రలో టబును తీసుకున్నారు. ఇప్పుడు ప్రియమణిని మరో కీలక పాత్ర కోసం ఎంపిక చేసుకోవటం సినిమా ఆసక్తికరంగా మారుతోంది. ప్రియమణి పాత్ర ఇంట్రెస్టింగ్గా ఉంటుందని చిత్రబృందం చెబుతోంది. ఈ సినిమాతోనైనా ప్రియమణికి వరుస చాన్స్‌లు వస్తాయేమో చూడాలి.













